ఫర్ యువర్ ఇయర్స్ ఓన్లీ.. | For your ears only | Sakshi
Sakshi News home page

ఫర్ యువర్ ఇయర్స్ ఓన్లీ..

Published Sat, Dec 20 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM

ఫర్ యువర్ ఇయర్స్ ఓన్లీ..

ఫర్ యువర్ ఇయర్స్ ఓన్లీ..

ఇయర్‌కి ఒకసారి ఒక స్టైల్‌ని భుజానికి ఎత్తుకోవడం ఫ్యాషన్ ఇండస్ట్రీకి అలవాటు. ఇప్పుడు చెవికి చేసే అలంకారం వంతు వచ్చింది. చెవిని కేంద్రంగా చేసుకుంది. దీంతో ఈ ఏడాది మధ్య కాలం నుంచి ఇయర్ యాక్సెసరీస్‌కి డిమాండ్ పెరిగింది. ఇయర్ కఫ్స్‌కి ఎక్కడాలేని ప్రాచుర్యం వచ్చేసింది. సిటీలో ఫ్యాషన్ పరంగా అప్‌డేట్‌గా ఉండే మహిళల చెవులకు వన్నెలద్దుతూ కలర్‌ఫుల్ అండ్ చూడబుల్‌గా మారుతున్నాయి.
 
కాదే భాగమూ అలంకరణకు అనర్హం అన్నట్టు.. ఒళ్లంతా కమ్మేస్తున్న ఫ్యాషన్.. ఇప్పుడు ‘ఇయర్’తో హియర్, హియర్ అంటోంది. నిన్నమొన్నటి దాకా చెవి దిద్దులు, హ్యాంగింగ్స్ అంటూ కాస్త లిమిట్స్‌లోనే వీనులకు విందు చేసిన మోడ్రన్ ప్రపంచం ఇప్పుడు వాటి కోసం ఫంకీ జ్యువెలరీని మోసుకొచ్చేసింది.
 
 సినిమా ‘చూపింది’...
 చాలా ట్రెండ్స్‌ను అందించిన బాలీవుడ్ చెవి యాక్సెసరీస్ విషయంలోనూ ఓ దారి చూపింది. దీపిక పదుకునే తను నటించిన పలు సినిమాల్లో ఇయర్‌కఫ్స్‌ను డిఫరెంట్‌గా ప్రదర్శించడం సిటీలో మహిళలను ఇన్‌స్పైర్ చేసింది. ‘దీపిక పదుకునే సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆమె ఫ్యాషన్స్‌ను క్యారీ చేసే తీరు చాలా బాగుంటుంది’ అని కార్పొరేట్ ఉద్యోగిని శ్రావణి చెప్పడం దీనికో ఉదాహరణ. దీపిక డ్రెస్సుల్ని, యాక్సెసరీస్‌ను సైతం మక్కీకి మక్కీ అనుసరించే సిటీ మహిళలు.. ఈ ఇయర్‌కఫ్స్ ట్రెండ్‌కు ఊపందిస్తున్నారు.
 
 చెవి‘నిల్లు’గా.. ఫుల్లుగా..
 ఈ ఏడాది ఫ్యాషన్‌ను చెవికి అనుసంధానించడంతో.. మార్కెట్లో రకరకాల ఇయర్‌కఫ్స్ వెల్లువెత్తుతున్నాయి. విభిన్న రకాల హ్యాంగింగ్స్ తర్వాత చెవిని పూర్తిగా కవర్ చేసేసి, సగం వరకూ లేదా టాప్‌ను మాత్రమే లేదా అంచుల్ని.. అదీ కాకుంటే చెవిని పూర్తిగా తమలో పూర్తిగా ఇముడ్చుకునే కఫ్స్‌కు ఇప్పుడు ఫుల్ డిమాండ్ వచ్చింది. సిల్వర్‌తో పాటు విభిన్న రకాల మెటల్స్‌తో ఇవి రూపొందిస్తున్నారు. రూ.200 నుంచి మొదలుకుని రూ.5,000ల దాకా ధరల్లో అందుబాటులో ఉన్నాయి.
 
ఇట్స్‌ది ఇయరాఫ్ ఇయర్...
 ఫ్యాషన్‌కు ఏ బాడీ పార్ట్‌నైనా గ్లామరస్‌గా మెరిపించే శక్తి ఉంది. ఈ ఏడాది చెవికి సంబంధించిన యాక్సెసరీస్ బాగా వచ్చాయి.  హ్యాంగింగ్స్, ఇయర్‌కఫ్స్ వెరైటీలు మార్కెట్లో బాగా లభిస్తున్నాయి. చెవి సైజ్‌కు, స్కిన్ కలర్‌కు మ్యాచ్ అయ్యేలా డిఫరెంట్ కఫ్స్ వచ్చేశాయి. వీటిని వినియోగించడం ద్వారా ఫ్యాషనబుల్ పర్సన్‌గా అనే స్టేట్‌మెంట్‌ని చెప్పకనే చెప్పినట్టు ఉంటుంది. లాంగ్ మ్యాక్సీ డ్రస్‌లకు కాంబినేషన్‌గా వీటిని ధరిస్తే లుక్ సూపర్బ్.
 - గీతికా చద్దా, ఫ్యాషన్ డిజైనర్
 
 సినిమా ‘చూపింది’...
 చాలా ట్రెండ్స్‌ను అందించిన బాలీవుడ్ చెవి యాక్సెసరీస్ విషయంలోనూ ఓ దారి చూపింది.దీపిక పదుకునే తను నటించిన పలు సినిమాల్లో ఇయర్‌కఫ్స్‌ను డిఫరెంట్‌గా ప్రదర్శించడం సిటీలో మహిళలను ఇన్‌స్పైర్ చేసింది. ‘‘దీపికా పదుకునే సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆమె ఫ్యాషన్స్‌ను క్యారీ చేసే తీరు చాలా బాగుంటుంది’’ అని కార్పొరేట్ ఉద్యోగిని శ్రావణి చెప్పడం దీనికో ఉదాహరణ. దీపిక డ్రెస్సుల్ని యాక్సెసరీస్‌ను సైతం మక్కీకి మక్కీ అనుసరించే సిటీ మహిళలు... ఈ ఇయర్‌కఫ్స్ ట్రెండ్‌కు ఊపందిస్తున్నారు.
 - ఎస్.సత్యబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement