రేమండ్స్ జ్ఞాపకం | Mary Raymonds memorial: greatest adventure hero known | Sakshi
Sakshi News home page

రేమండ్స్ జ్ఞాపకం

Published Mon, Aug 11 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM

రేమండ్స్ జ్ఞాపకం

రేమండ్స్ జ్ఞాపకం

మైఖేల్ జోభిమ్ మేరీ రేమండ్స్..  క్లుప్తంగా రేమండ్స్ అని పిలుస్తారు. గొప్ప సాహస వీరుడిగా ప్రతీతి. హైదరాబాద్‌లోని నిజాం కాలేజి దగ్గర వున్న గన్‌ఫౌండ్రీ గురించి తెలుసు కదా? గన్‌ఫౌండ్రీ ఏర్పాటుకు ఆద్యుడు రేమండ్స్. రెండవ నిజాం ప్రభువు.. నిజాం ఆలీఖాన్ సంస్థానంలో కంట్రోలర్ ఆఫ్ ఆర్డినెన్స్ శాఖ అధిపతిగా రేమండ్స్ పనిచేశాడు. మందు గుండు సామగ్రి, ఫిరంగులు ఆయన నేతృత్వంలో తయారయ్యేవి. తుపాకీలు లేని ఆ రోజుల్లో నిజాం సైన్యం ఫిరంగులనే ఆయుధంగా వాడేవారు. హిందువులు అతడ్ని గొప్ప సాధువుగా ‘మూసా రాం’ అని ఆరాధించారు.
 
 భరత భూమిని ఎందరో ఏలారు.. అందులో విదేశీయులూ ఉన్నారు. చక్రవర్తులుగా చెలామణి అయిన రాజులకే కాదు.. దేశాన్ని లూటీ చేసిన ద్రోహులకూ చరిత్ర తన పుటల్లో స్థానాన్నిచ్చింది. రాజుల సంగతి అటుంచితే.. ముసాఫిర్లుగా భారతావనికి వచ్చిన వారికీ చరిత్ర తనలో చోటిచ్చింది. అలా స్థానం దక్కించుకున్న వారిలో ఒకడే మైఖేల్ జోభిమ్ మేరీ రేమండ్స్. ఈ సైనికుడి పుట్టుక ఫ్రాన్స్‌లోనే అయినా.. ఆయన ఆనవాళ్లు శాశ్వతంగా నిలిచిపోయింది మాత్రం మన హైదరాబాద్‌లోనే..
 
  ముస్లింలు ‘మూసా రహీం’ అని ప్రేమించారు. హైదరాబాదీయులు రేమండ్స్‌ను అభిమానించినంతగా మరే విదేశీయుడినీ ఆరాధించి ఉండరు. 29 ఏళ్ల రేమండ్స్ వ్యాపారం కోసం 1775లో పాండిచ్చేరికి వచ్చాడు. అయితే వ్యాపారం చేయకుండా స్థానికంగా ఉన్న బ్రిటిష్ సైన్యంలో సైనికునిగా చేరాడు. ఆ తర్వాత మైసూరు వెళ్లి, హైదరాలీ సైన్యంలో చేరాడు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకుని ఆనాటి నిజాం సంస్థానంలో చేరాడు. అనతి కాలంలోనే
 
 నిజాం మనసు గెలిచాడు. రేమండ్స్ మందు
 గుండు సామగ్రి తయారీలో సుశిక్షితుడు. అంతకంటే మిన్నగా గొప్ప స్నేహశీలి. ఐతే, దురదృష్టవశాత్తు.. 42 ఏళ్ల వయసులోనే, 1798 మార్చి 25న కన్నుమూశాడు. ఆ మహనీయుని గుర్తుగా రేమండ్స్ జ్ఞాపకాన్ని మలక్‌పేటలో, టీవీ టవర్  వెనకాల ఉన్న ఓ చిన్న గుట్టపై నిర్మించారు. 180 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పుతో  ఒక చూడచక్కని కట్టడాన్ని సమాధి చుట్టూతా నిర్మించారు. ఇక్కడి శిలాఫలకంపై ఇలా రాసి ఉంది.
 "Sacred to the memory of General Michel Joachim marie Reymonds, Controller of Ordnance, The Nizam's Army.
 Born September 25 th 1755.
 Died March 25th 1798.
 Faith unto Death, R.I.P'
 
రేమండ్స్ సమాధిని రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ కట్టడంగా ప్రకటించింది. ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ చిన్న కొండ మీద నుంచి భాగ్యనగరం ఎంతో అందంగా కనిపిస్తుంది. రాత్రిపూట మరింత శోభాయమానంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చూడచక్కని ప్రదేశం రేమండ్స్ జ్ఞాపకం. ఐతే, ఇక్కడి దాకా చేరడానికి ప్రస్తుతానికి సరైన రహదారి లేదు. దారి చూపించే సైన్ బోర్డులు కూడా సరిగ్గా లేవు. చుట్టుప్రక్కల చాలా భాగం అన్యాక్రాంతమై గజిబిజిగా ఉంది. ఈ నిర్మాణం పర్యాటక, పురావస్తుశాఖ ఆధీనంలో వుంది. వారు కొద్దిపాటి శ్రద్ధ తీసుకుంటే గొప్ప పర్యాటక కేంద్ర ంగా విరాజిల్లుతుంది. చారిత్రక పర్యాటకాభిలాషులు అప్పటిదాక ఆగాల్సిన పన్లేదు. ఆసక్తిగలవారు రేమండ్స్ జ్ఞాపకాన్ని ఎప్పుడైనా సందర్శించవచ్చు.
 - మల్లాది కృష్ణానంద్
 malladisukku@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement