చిట్టి కథలు.. గట్టి బుర్రలు | Message oriented short fimls at khammam | Sakshi
Sakshi News home page

చిట్టి కథలు.. గట్టి బుర్రలు

Published Fri, Nov 14 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM

చిట్టి కథలు.. గట్టి బుర్రలు

చిట్టి కథలు.. గట్టి బుర్రలు

చిన్నారులకు సంబంధించి తీసిన చిత్రాలను పంపమన్న సిటీప్లస్ ఆహ్వానానికి నగరవాసులు గణనీయ సంఖ్యలో స్పందించారు. తాము తీసిన లఘుచిత్రాలను పంపారు. వీటిలో అత్యధిక భాగం చక్కని సందేశాలతో, ప్రతి ఒక్కరూ తెలుసుకోవల్సిన విషయాలతో నిండి ఉండడం ఎంతైనా అభినందనీయం. అన్ని చిత్రాలూ బాగున్నా... పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటిలో నుంచి 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం జరిగింది. మాకు పెద్దసంఖ్యలో అందిన మిగతా చిత్రాలను  ప్రాధాన్యత క్రమంలో మా ‘షార్ట్ సినిమా’ కాలమ్‌లో ప్రచురించడం జరుగుతుంది. ఉత్తమ చిత్రాలకు త్వరలోనే బహుమతులు అందజేస్తాం.  
 
 మాల 
 డైరెక్టర్: విజయ్‌కుమార్, ఇంగ్లిష్ ఫ్యాకల్టీ
 కథనం: సర్కస్ ఫీట్స్ చేసి జీవించే
కుటుంబంలోని ఓ చిన్నారి వ్యథ

చిన్నారులకు సంబంధించి తీసిన చిత్రాలను పంపమన్న సిటీప్లస్ ఆహ్వానానికి నగరవాసులు గణనీయ సంఖ్యలో స్పందించారు. తాము తీసిన లఘుచిత్రాలను పంపారు.


 ఓ మారుమూల బస్తీలో  తాడు మీద నడుస్తూ సర్కస్‌ఫీట్స్ చేస్తూ జీవించే కుటుంబంలో చిన్నారి వ్యథకు ఇది చిరు తెర రూపం. చదువుకోవాలనే ఆమె ఆశకు ఆర్థిక సమస్యలతో పాటు చిట్టి భుజాల మీద సంపాదన బాధ్యత కూడా తోడవుతుంది. ఆమె తండ్రికి ఈ చిన్నారి మీద ఆప్యాయత, ప్రేమ ఉన్నా... తాగుడు వ్యసనం. ఆ చిన్నారి తన ఫాదర్‌ని ఎలా మార్చింది? తనెలా చదువుకోవాలనే కలను సాకారం చేసుకుంది అనేది సినిమా కథ. మొత్తం 15 నిమిషాల నిడివి ఉండే ఈ బుల్లి చిత్రాన్ని ఇంగ్లండ్‌లో కమ్యూనిటీ చానల్ వాళ్లు టెలికాస్ట్ చేశారు. చందానగర్‌లోని విబ్‌గ్యార్ ఇంగ్లిష్ మీడియం స్కూలు పిల్లలే పాత్రధారులుగా యాక్ట్ చేసిన ఈ సినిమా రూపకర్త ఆ స్కూల్‌లో ఇంగ్లిష్ ఫ్యాకల్టీ విజయ్‌కుమార్.  
 
 జస్విక కథ
 దర్శకత్వం: రాజా , ఎడిటింగ్: ఉషామాధవి
 కథనం: చాకోబార్ కోసం డబ్బు కూడబెట్టి కొనుక్కున్న జస్విక కథ ఇది
జస్విక ఓ నాలుగేళ్ల చిన్నారి. ముద్దులొలికే ఆ చిన్నారికి చాకోబార్ తినాలని ఉంటుంది. అమ్మానాన్నలను ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోరు. కిట్టీ బ్యాంక్‌లో ఉన్న రెండు రూపాయలు తీసుకుని ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వెళ్తుంది. చాకోబార్ రేట్ రూ.20 అని తెలుసుకుని బుంగమూతితో ఇంటికి చేరుతుంది. ఇదే విషయాన్ని అక్వేరియంలో ఉన్న బుల్లి చేపపిల్లతో చెప్పుకుంటుంది జస్విక. ఎలాగైనా రూ.20 కూడబెట్టాలని డిసైడ్ అవుతుంది. రోజూ రెండు రూపాయల చొప్పున పొదుపు చేస్తుంటుంది.
 
  ప్రతి రోజూ కిట్టీ బ్యాంక్‌లో డబ్బులు వేసి ఆ విషయం చేపపిల్లతో చెప్తుంటుంది. పది రోజుల తర్వాత రూ.20 తీసుకెళ్లి చాకోబార్ తెచ్చుకుంటుంది. ఎవరి కంటా పడకుండా బాల్కనీలో తినాలని ప్లాన్ చేస్తుంది. వాళ్లమ్మ పిలవడంతో ఇంట్లోకి వెళ్తుంది. తీరా వచ్చేసరికి చాకోబార్  కాస్తా కరిగిపోతుంది. అది చూసి జస్విక ఏడుపు అందుకుంటుంది. ఆ చిన్నారి బాధను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు.. సాయంత్రం ఓ చాకోబార్ కొనివ్వడంతో కథ ముగుస్తుంది. జస్విక పాత్రలో చిన్నారి జస్విక అదరగొట్టింది. ఓ చిన్నారి అంతరంగాన్ని ఆవిష్కరించిన ఈ షార్ట్ ఫిల్మ్‌కు దర్శకుడు జస్విక తండ్రి రాజా అయితే, తల్లి ఉషామాధవి ఎడిటింగ్ చేసింది.  
 
 స్పైడర్ బాయ్  
 డైరెక్టర్: నిమ్మకాయల రాంజీ
 వయసు: 9 ఏళ్లు, 4వ తరగతి,
డీఏవీ పబ్లిక్ స్కూల్, సికింద్రాబాద్
 కథనం: ప్రాణాపాయంలో ఉన్న స్పైడర్ బాయ్
సమయానికి 108 అంబులెన్‌‌స వచ్చి బతుకుతాడు
 
మా మదర్ ఫోన్ తీసుకుని సినిమాల్లో ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్‌ని షూట్ చెయ్యటం ట్రై చేస్తున్నాను. ఆ టెక్నిక్ నేను కనుక్కుని షూట్ చేసి మా డాడీకి చెప్పాను. అప్పుడు ఆయన షార్ట్ ఫిలిం తియ్యమని సజెస్ట్ చేశారు. ఆ తర్వాత టీవీలో స్పైడర్ మ్యాన్ చూసి అందులో సాంగ్‌తో షార్ట్‌ఫిలిం ఆలోచన వచ్చింది. మా తాతయ్య స్పైడర్ బాయ్ బొమ్మ కొనిచ్చారు. మొబైల్ కెమెరాతో దీన్ని షూట్ చేశాను. సినిమా కథ ఏంటంటే... స్పైడర్ బాయ్ తన శక్తితో ఎగురుతూ ఉంటాడు. మధ్యలో శక్తి కోల్పోతాడు. అప్పుడు 108 అంబులెన్స్ రావటంతో స్పైడర్ బాయ్ ప్రాణాలు నిలుస్తాయి. ఈ ఫిలిం మేకింగ్‌కి కజిన్.. అని, అమ్మ, నాన్నతో పాటు ఆయన ఫ్రెండ్స్ చిక్కాల, నవీన్ హెల్ప్ చేశారు. మానాన్న ప్రసాద్ అష్టా చమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాల జంపాల సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ప్రస్తుతం మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. తరువాతి షార్ట్ ఫిలింకి నేనే మ్యూజిక్ చేయాలనుకుంటున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement