కేన్వాస్‌పై కాకి తీర్పు.. | The Crows verdict is the name of kandan show | Sakshi
Sakshi News home page

కేన్వాస్‌పై కాకి తీర్పు..

Published Wed, Nov 5 2014 12:35 AM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

కేన్వాస్‌పై కాకి తీర్పు.. - Sakshi

కేన్వాస్‌పై కాకి తీర్పు..

‘ద క్రోస్ వెర్డిక్ట్’.. ఔను! కాకి తీర్పు. మంగళూరు కళాకారుడు జి.కందన్ తన ప్రదర్శనకు పెట్టిన పేరు ఇది. ఆయన చిత్రాల్లో సుందర నందనవనాలు, పురివిప్పిన నెవుళ్లు, హొయలొలికించే హంసలు ఉండవు. ఆయన చిత్రాల్లో ప్రస్ఫుటంగా కనిపించేవి కాకులే! కాకులు, అవి సంచరించే పరిసరాలనే ఆయన కేన్వాస్‌పైకి ఎక్కించారు. కందన్ చిత్రాల్లో కనిపించే కాకి మీడియూకు ప్రతీక. ఆయన చిత్రాల్లో కాగితపు రాకెట్లూ కనిపిస్తారుు. సమాచార ప్రసార వేగానికి ప్రతీక ఈ రాకెట్లు.

బంజారాహిల్స్ రోడ్ నం: 12లోని ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో ‘ద క్రోస్ వెర్డిక్ట్’ ప్రదర్శనను ఏర్పాటు చేసిన కందన్ తన చిత్రాల్లో ఎంచుకున్న ముఖ్యాంశం మీడియూనే. మీడియా ఒక చట్రంలో ఇరుక్కుని, దాని నుంచి బయటకు రాలేకపోతోందని, స్వేచ్ఛగా వ్యవహరించడం లేదని ఆయున ఫిర్యాదు. పెట్టుబడిదారుల చేతుల్లో చిక్కుకున్న మీడియాను ఆయన తన చిత్రాల్లో అల్లిబిల్లి తీగల నడువు సంచరించే కాకిలా చిత్రించారు. మీడియాకు సజీవమైన ప్రతీక కాకి మాత్రమేనని అన్నారు కందన్. ఇప్పటి వరకు బెంగళూరు, భోపాల్, ఢిల్లీ, పుణే నగరాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేశానని, త్వరలోనే అమెరికాలోనూ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నానని తెలిపారు.

వీఎస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 

పోల్

Advertisement
Advertisement