
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే కథ సిద్ధం అయింది..ఈ సినిమాపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉన్నది. ఇటీవలే చిరంజీవి పుట్టినరోజుని పురస్కరించుకొని దర్శకుడుని ఎంపిక చేయవలసి ఉందని రామ్ చరణ్ చెప్పారు. దర్శకుడు ఎవరన్నది సందిగ్ధంలో ఉంది. ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదు. కొంతమంది మాత్రం ఈ సినిమాని వివి వినాయక్ డైరెక్ట్ చేస్తాడని చెబుతున్నారు.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్స్గా ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. ఒక స్పష్టత లేదు. ఎవరిని సంప్రదిస్తున్నారనే విషయం కూడా బయటకు రాలేదు. అయితే పలువురు హీరోయిన్లు చిరంజీవి సరసన నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వినాయక్ ఇప్పటికే దర్శకుల రేసులో ఉన్నందున, అతడికి కొందరు హీరోయిన్స్ నుంచి సందేశం వెళ్లినట్లు తెలుస్తోంది. . అలాగే సన్నిలియోన్ సైతం చిరు సినిమాలో ఏదైనా పాత్రలో నటించేందుకు ఆసక్తి చూపిస్తోందని సమాచారం. చిరు సినిమాలో హీరోయిన్గా నటించడానికి ప్రణీత , శ్రీయ ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు.
సీనియర్ నటి టబు కూడా చిరు 150వ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.అయితే ఇందులో హీరోయిన్ అవకాశం ఎవరికి దక్కుతుందో ఊహించి చెప్పడం కష్టం. టాలీవుడ్లో ఎప్పుడు ఎక్కడ విన్నా ఈ చిత్రం గురించే వినిపిస్తోంది. ఇక అభిమానులు, ప్రేక్షకులు చిరు సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో వేరే చెప్పవలసిన అవసరంలేదు.
**