భరతమాత దత్తపుత్రిక
సామ్యవాదం అనేది ఓ గొప్ప ఆదర్శనీయ సిద్ధాంతం. మనుషులు స్వార్థపరులైన చోట దాన్ని సాధించడం, ఆచరించటం అసాధ్యం.
- అనిబిసెంట్
అనిబిసెంట్... సామ్యవాది, మహిళా హక్కుల ఉద్యమవాది, రచయిత, దివ్యజ్ఞాన సమాజ నేత., హోంరూల్ ఉద్యమకారిణి... అన్నింటినీ మించి భారతదేశ స్వాతంత్య్రానికి పోరాడిన బ్రిటిష్ వనిత. బానిసలుగా నలుగుతున్న భారతీయులకు విముక్తి కలిగించాలని కంకణం కట్టుకున్న అనిబిసెంట్... భిన్న సంస్కృతులకు నిలయమైన భారతా వనిలో స్థిరపడాలని నిర్ణయించుకోవడమే కాదు... తుది శ్వాస వరకు భారత దేశంలోనే ఉన్నారు.
లండన్‌లో ఓ మధ్య తర గతి కుటుంబంలో అనీ వుడ్ 1847 అక్టోబర్ 1న జన్మించారు. తల్లి ఎమ్లీ మోరీస్, తండ్రి విలియం వుడ్. ఆమె ఐదు సంవత్సరాల వయస్సులో తండ్రిని కోల్పోయింది. అప్పటినుంచి తల్లి ఎమిలీ మోరిస్ ‘హారో స్కూల్’ బాలల వసతి గృహం నిర్వహిస్తూ కుటుంబ భారాన్ని మోసేది.
కుటుంబాన్ని పోషించలేక ఎమిలీ మోరిస్ తన కూతురు అనిబిసెంట్‌ను స్నేహితురాలైన మారియెట్‌కు అప్పగించింది. అనిబి సెంట్‌కు సమాజం పట్ల బాధ్యత, స్త్రీ స్వాతంత్య్రం పట్ల అవగాహన కల్పిం చింది మారియెట్. చిన్న వయస్సులోనే అనిబిసెంట్ ఐరోపా అంతటా పర్యటించింది. అక్కడ ఆమెకు రోమన్ క్యాథలిక్ మతం పట్ల అభిరుచి ఏర్పడింది. తల్లి కోరికపై అనీ తన 19వ ఏట ఫాదర్ ఫ్రాంక్ బిసెంట్‌ని వివాహమాడి, అనిబిసెంట్‌గా మారారు. వివాహా నంతరం భర్తతో స్పర్థలు వచ్చి విడిపో వడం.. తల్లి మరణించడంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.
కుటుంబ జీవితానికి పూర్తిగా దూరమైన ఆమె తన మిగతా జీవితాన్ని మానవ సేవలో గడపాలని నిర్ణయించుకున్నారు. 1880లో హెలెనా బ్లావట్‌స్కీని కలుసుకున్న తరువాత ఆమె ఆసక్తి సామ్యవాదం నుంచి దివ్యజ్ఞానం వైపు మళ్లింది. ఆమె దివ్యజ్ఞాన సమాజంలో సభ్యత్వం స్వీకరించి మంచి ఉపన్యాసకురాలిగా పేరు తెచ్చుకుంది. దివ్యజ్ఞాన సమాజం బాధ్యతలలో భాగంగా ఆమె భారతదేశం వచ్చారు. 1970లో దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు.
పెళ్లైన తర్వాత అనిబిసెంట్ 1874లో ఇంగ్లాండ్‌లోని నేషనల్ సెక్యులర్ సొసైటీ అనే సంస్థలో చేరారు. లా అండ్ రిపబ్లిక్ లీగ్‌ను స్థాపించి పోలీసుల అత్యాచారాలకు బలైన మహిళల తరఫున పోరాటం చేశారు. భారత దేశంలో అడుగుపెట్టిన అనిబిసెంట్ కేవలం దివ్యజ్ఞాన సమాజ కార్యక్రమాలకే పరిమితం కాకుండా పలు చైతన్య కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించారు. దేశంలో ప్రో యూనియన్ స్థాపించి కార్మికుల కోసం పోరాడారు. 1897 లోనే భారత జాతీయ కాంగ్రెస్‌కు తొలి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. 1898 జూలై 7 విద్యాసౌధాన్ని స్థాపించి, అది అలహాబాద్ విశ్వ విద్యాలయ సంస్థగా ఎదిగేందుకు కృషి చేశారు. 1914లో మెదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అయిన సమయంలో హోంరూల్ లీగ్ ద్వారా భారత స్వాతంత్య్రోద్యమంలో సహకరించారు. 1916లో భారత స్వాతంత్య్రేచ్ఛను ప్రతిబింబించే హోం రూల్ ఉద్యమానికి నాయక త్వం వహించారు.
అనిబిసెంట్ తన జీవితకాలం వివిధ ఉద్యమాల్లో, చైతన్య కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక చర్చల్లో చురుకుగా పాల్గొన్నారు. నేషనల్ సెక్యులర్ సొసైటీ(ఎన్‌ఎస్‌ఎస్)లో, దివ్య జ్ఞాన సమాజంలో ఆమె ఉపన్యాసాలకోసం శ్రోతలు ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఫెబియన్ సొసైటీ, మార్క్సిస్టు సోషల్ డెమొక్రటిక్ ఫెడరేషన్‌లో జరిగే అన్ని సమావేశాల్లోనూ ఆమె ప్రధానవక్త. మరోవైపు వివిధ రకాల యూనియన్‌ల కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరించే వారు. 1888లో బ్లడీ సండే ప్రదర్శనలో, లండ న్ మ్యాచ్ గర్ల్ప్ సమ్మెలో పాల్గొన్నారు.
వారణాసిలో కేంద్ర హిందూ కళాశాల (1898) స్థాపించడానికి ఎంతగానో సహయపడ్డారు. అలాగే 1922 హైదరాబాద్(సింధ్) నేషనల్ కొలేజియెట్ బోర్డు ముంబైలో స్ధాపించడానికి కారణమయ్యారు. ఇలా అన్ని రకాలుగా సమాజంలోని బడుగు బలహీన వర్గాల చైతన్యం కోసం పోరాడిన అనిబిసెంట్ 1933 సెప్టెంబర్ 20న మద్రాసులోని అడయార్‌లో తుదిశ్వాస విడిచారు.