క్రిస్పీ టాస్డ్ బేబీ కార్న్ | Crispy Tasd Baby Corn | Sakshi
Sakshi News home page

క్రిస్పీ టాస్డ్ బేబీ కార్న్

Published Sat, Jun 4 2016 11:44 PM | Last Updated on Mon, Aug 20 2018 7:27 PM

క్రిస్పీ టాస్డ్ బేబీ కార్న్ - Sakshi

క్రిస్పీ టాస్డ్ బేబీ కార్న్

స్నాక్ సెంటర్
కావలసినవి: బేబీ కార్న్ - 7, నూనె - 2 టేబుల్ స్పూన్లు, చిన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు - 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 2 టేబుల్ స్పూన్లు, తరిగిన కొత్తిమీర - పావుకప్పు, తరిగిన ఉల్లిపాయలు - పావుకప్పు, ఉప్పు - తగినంత, బియ్యం పిండి - ఒకటిన్నర టేబుల్ స్పూన్, మైదా పిండి - 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు - 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి - 1 టీ స్పూన్, నూనె - సరిపడా
 
తయారీ: బేబీకార్న్‌లను కడిగి ఆరబెట్టి, రెండేసి ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత ఓ గిన్నెలో బియ్యం పిండి, మైదా పిండి, ఉప్పు వేసి బాగా కలిపి, అందులో కొన్ని నీళ్లు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు స్టౌ పైన ప్యాన్ పెట్టి, నూనె పోసి వేడి చేయాలి. ఈ బేబీకార్న్ ముక్కలను బియ్యం పిండి మిశ్రమంలో ముంచి ఆ నూనెలో ఫ్రై చేయాలి. స్టౌ పైన మరో ప్యాన్ పెట్టి, అందులో నూనె పోసి వేడి చేయాలి. అందులో వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి వేయించాలి.

తర్వాత దాంట్లో ఉల్లిపాయలు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో బేబీ కార్న్ వేసి, రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి వాటిపై నువ్వులు, ఉల్లికాడలు వేసి గార్నిష్ చేసుకోవాలి.

బీట్‌రూట్ పరాటా
కావలసినవి: గోధుమ పిండి - 4 కప్పులు, బీట్‌రూట్ (చిన్నవి) - 3, పచ్చిమిర్చి (చిన్న ముక్కలుగా చేసినవి) - 1 టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర - పావుకప్పు, జీలకర్ర - అర టీ స్పూన్, దనియాలు - 2 టీ స్పూన్లు, నువ్వులు - అర టీ స్పూన్, ఉప్పు - తగినంత, నూనె లేదా బటర్ - కావలసినంత
 తయారీ: ముందుగా పచ్చిమిర్చి ముక్కలు, దనియాలు, నువ్వులను కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బీట్‌రూట్‌లను శుభ్రంగా కడిగి, పైన తొక్క తీసి సన్నగా తురుముకోవాలి. తర్వాత స్టౌ పైన ప్యాన్ పెట్టి, అందులో నూనె పోసి వేడి చేయాలి. అందులో బీట్‌రూట్ తురుములో సగభాగం, గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమం వేయాలి. రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమ పిండి, మిగిలిన బీట్‌రూట్ తురుము, ఉప్పు వేసి నీళ్లు పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. తర్వాత పిండిని కొద్దికొద్దిగా తీసుకొని పెద్దసైజు చపాతీల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఆ చపాతీ మధ్యలో బీట్‌రూట్ మిశ్రమాన్ని పెట్టి చివర్లను మధ్యలోకి తీసుకువచ్చి మళ్లీ చపాతీల్లా ఒత్తుకోవాలి. తర్వాత వాటిని నూనె లేదా బటర్‌తో పెనంపై రెండువైపులా కాల్చుకుంటే సరి. (బీట్‌రూట్ తురుము మొత్తాన్ని మధ్యలోని స్టఫ్‌లోకి కూడా ఉపయోగించుకోవచ్చు)

డేట్ స్క్వేర్స్
కావలసినవి: బాదం గింజలు - ఒకటిన్నర కప్పు, ఓట్స్ - ఒకటిన్నర కప్పు, ఉప్పు - అర టీ స్పూన్, తరిగిన ఖర్జూరం - 3 కప్పులు, కొబ్బరి నూనె - పావుకప్పు, నీళ్లు - అర కప్పు
 
తయారీ: ముందుగా మిక్సీలో ఓట్స్, బాదం గింజలు, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక కప్పు తరిగిన ఖర్జూరం వేసి మరో రెండు రౌండ్లు తిప్పుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకొని, అందులో కొబ్బరినూనె పోసి కలుపుకోవాలి. మిశ్రమం పొడిపొడిగా కాకుండా స్టిక్కీగా ఉండేలా చూసుకోవాలి.

సగభాగం మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టాలి. మరోవైపు ఒక ప్లేట్‌పై టిష్యూ పేపర్ వేసి, దాంట్లో మిగిలిన సగభాగాన్ని స్క్వేర్ షేప్ బిళ్లల్లా పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన రెండు కప్పుల ఖర్జూరం తరుగు, నీళ్లు పోసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా ప్లేట్‌లో పెట్టుకున్న బిల్లలపై ఫొటోలో కనిపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. తర్వాత మొదట పక్కన పెట్టుకున్న ఓట్స్ మిశ్రమాన్ని వీటిపై చల్లి, ఈ ప్లేట్‌ను డీప్‌ఫ్రిజ్‌లో గంటసేపు పెట్టి తీయాలి. అవన్ ఉంటే వీటిని బేక్ చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement