Baby Corn
-
అరటి రైతులకు శుభవార్త ! ఆ దేశంతో కుదిరిన ఒప్పందం
భారత్, కెనడా దేశాల మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు భారత్ నుంచి అరటి, బేబీ కార్న్‌లను దిగుమతి చేసుకునేందుకు కెనడా అంగీకరించింది. కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహూజా, కెనడా హైకమిషనర్ కెమరాన్ మెక్‌కేల మధ్య జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భారత్, కెనడాల మధ్య తాజాగా కుదిరిన ఒప్పందంతో తాజా అరటి పళ్లను తక్షణమే దిగుమతి చేసుకునేందుకు కెనడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా సాంకేతిక అంశాల కారణంగా బేబీకార్న్ దిగుమతికి కొంత సమయం కావాలని కెనడా కోరింది. దాదాపు 2022 ఏప్రిల్ చివరి నాటికి భారత్ నుంచి కెనడాకి బేబీకార్న్ ఎగుమతులు ప్రారంభం కావొచ్చు. మన దేశంలో అరటి పంటను భారీ ఎత్తున సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ , తెలంగాణలో వేలాది ఎకరాల్లో అరటి సాగవుతోంది. తాజాగా అరటి దిగుమతికి కెనడా అంగీకరించడంతో రైతులకు, వ్యాపారులకు కొత్త మార్కెట్ అందుబాటులోకి వచ్చినట్టయ్యింది. -
బేబీ కార్న్ విత్ కోకోనట్
హెల్దీ కుకింగ్ కావలసినవి బేబీకార్న్ – 10 నూనె – 1 టీ స్పూన్ పచ్చికొబ్బరి తురుము – 2 టీ స్పూన్లు ఆవాలు – పావు టీ స్పూన్ పచ్చి మిర్చి – 1 (సన్నగా తరగాలి) వెల్లుల్లి – 2 రెబ్బలు (సన్నగా తరగాలి) ఉప్పు – రుచికి తగినంత తయారి 1. ఒక్కొక్క బేబీకార్న్‌ను ముక్కలుగా కట్‌చేసి వెడల్పాటి పాత్రలో వేసుకోవాలి. 2. పైన కొద్దిగా వెల్లుల్లి, పచ్చి మిర్చి చల్లుకోవాలి. 3. కడాయిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, వెల్లుల్లి, పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. 4. బేబీకార్న్‌ను ఈ పోపులో వేసి, ఉప్పు చల్లి కలిపి, నిమిషం సేపు ఉంచాలి. 5. తురిమిన కొబ్బరి చల్లి, కలిపి దించుకోవాలి. నోట్: అన్నంలోకి సైడ్ డిష్‌లా, ఈవెనింగ్ స్నాక్స్‌లా తీసుకుంటే బాగుంటుంది. -
క్రిస్పీ టాస్డ్ బేబీ కార్న్
స్నాక్ సెంటర్ కావలసినవి: బేబీ కార్న్ - 7, నూనె - 2 టేబుల్ స్పూన్లు, చిన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు - 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 2 టేబుల్ స్పూన్లు, తరిగిన కొత్తిమీర - పావుకప్పు, తరిగిన ఉల్లిపాయలు - పావుకప్పు, ఉప్పు - తగినంత, బియ్యం పిండి - ఒకటిన్నర టేబుల్ స్పూన్, మైదా పిండి - 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లికాడలు - 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి - 1 టీ స్పూన్, నూనె - సరిపడా తయారీ: బేబీకార్న్‌లను కడిగి ఆరబెట్టి, రెండేసి ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత ఓ గిన్నెలో బియ్యం పిండి, మైదా పిండి, ఉప్పు వేసి బాగా కలిపి, అందులో కొన్ని నీళ్లు పోసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు స్టౌ పైన ప్యాన్ పెట్టి, నూనె పోసి వేడి చేయాలి. ఈ బేబీకార్న్ ముక్కలను బియ్యం పిండి మిశ్రమంలో ముంచి ఆ నూనెలో ఫ్రై చేయాలి. స్టౌ పైన మరో ప్యాన్ పెట్టి, అందులో నూనె పోసి వేడి చేయాలి. అందులో వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి వేయించాలి. తర్వాత దాంట్లో ఉల్లిపాయలు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో బేబీ కార్న్ వేసి, రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి వాటిపై నువ్వులు, ఉల్లికాడలు వేసి గార్నిష్ చేసుకోవాలి. బీట్రూట్ పరాటా కావలసినవి: గోధుమ పిండి - 4 కప్పులు, బీట్రూట్ (చిన్నవి) - 3, పచ్చిమిర్చి (చిన్న ముక్కలుగా చేసినవి) - 1 టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర - పావుకప్పు, జీలకర్ర - అర టీ స్పూన్, దనియాలు - 2 టీ స్పూన్లు, నువ్వులు - అర టీ స్పూన్, ఉప్పు - తగినంత, నూనె లేదా బటర్ - కావలసినంత తయారీ: ముందుగా పచ్చిమిర్చి ముక్కలు, దనియాలు, నువ్వులను కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బీట్రూట్లను శుభ్రంగా కడిగి, పైన తొక్క తీసి సన్నగా తురుముకోవాలి. తర్వాత స్టౌ పైన ప్యాన్ పెట్టి, అందులో నూనె పోసి వేడి చేయాలి. అందులో బీట్రూట్ తురుములో సగభాగం, గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమం వేయాలి. రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమ పిండి, మిగిలిన బీట్రూట్ తురుము, ఉప్పు వేసి నీళ్లు పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. తర్వాత పిండిని కొద్దికొద్దిగా తీసుకొని పెద్దసైజు చపాతీల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఆ చపాతీ మధ్యలో బీట్రూట్ మిశ్రమాన్ని పెట్టి చివర్లను మధ్యలోకి తీసుకువచ్చి మళ్లీ చపాతీల్లా ఒత్తుకోవాలి. తర్వాత వాటిని నూనె లేదా బటర్‌తో పెనంపై రెండువైపులా కాల్చుకుంటే సరి. (బీట్రూట్ తురుము మొత్తాన్ని మధ్యలోని స్టఫ్లోకి కూడా ఉపయోగించుకోవచ్చు) డేట్ స్క్వేర్స్ కావలసినవి: బాదం గింజలు - ఒకటిన్నర కప్పు, ఓట్స్ - ఒకటిన్నర కప్పు, ఉప్పు - అర టీ స్పూన్, తరిగిన ఖర్జూరం - 3 కప్పులు, కొబ్బరి నూనె - పావుకప్పు, నీళ్లు - అర కప్పు తయారీ: ముందుగా మిక్సీలో ఓట్స్, బాదం గింజలు, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక కప్పు తరిగిన ఖర్జూరం వేసి మరో రెండు రౌండ్లు తిప్పుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకొని, అందులో కొబ్బరినూనె పోసి కలుపుకోవాలి. మిశ్రమం పొడిపొడిగా కాకుండా స్టిక్కీగా ఉండేలా చూసుకోవాలి. సగభాగం మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టాలి. మరోవైపు ఒక ప్లేట్‌పై టిష్యూ పేపర్ వేసి, దాంట్లో మిగిలిన సగభాగాన్ని స్క్వేర్ షేప్ బిళ్లల్లా పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన రెండు కప్పుల ఖర్జూరం తరుగు, నీళ్లు పోసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా ప్లేట్లో పెట్టుకున్న బిల్లలపై ఫొటోలో కనిపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. తర్వాత మొదట పక్కన పెట్టుకున్న ఓట్స్ మిశ్రమాన్ని వీటిపై చల్లి, ఈ ప్లేట్‌ను డీప్‌ఫ్రిజ్‌లో గంటసేపు పెట్టి తీయాలి. అవన్ ఉంటే వీటిని బేక్ చేసుకోవచ్చు. -
మొక్కజొన్న సాగు.. కొన్ని మెలకువలు
ఖరీఫ్‌లో మొక్కజొన్న పంటను వర్షాధారంగాను, నీటి వసతి కింద కూడా పండించుకోవచ్చు. ఈ పంటను విత్తనాల కోసం, కండెల కోసం, పాప్ కార్న్ కోసం, కూరగాయగా బేబీ కార్న్ రూపంలోనూ పండించుకోవచ్చు.విత్తనం కోసం పండించడానికి మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రీసెర్చ్ హైబ్రిడ్స్తోపాటు, వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన డీహెచ్ఎం 117, డీహెచ్ఎం 119, డీహెచ్ఎం 121 రకాలు సాగుకు అనుకూలం.వర్షాధారం పంటను జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. విత్తనం, భూమిలోని శిలీంద్రం నుంచి తొలిదశ మొక్కలను కాపాడటం కోసం 3 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ లేదా మాంకోజెబ్లలో ఏదైనా ఒక మందుతో విత్తన శుద్ధి చేయాలి. ఎకరాకు 8 కిలోల సంకర రకాల విత్తనాన్ని బోదెలపైన 1/3 వంతు ఎత్తులో విత్తితే వర్షం ఎక్కువైనప్పుడు నీరు బయటకు పోవడానికి వీలుంటుంది. బోదెకు, బోదెకు మధ్య దూరం 60 సెం. మీ., మొక్క కు, మొక్కకు మధ్య 20 సెం. మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి.పంట విత్తిన తరువాత రెండు, మూడు రోజుల లోపు అట్రజిన్ అనే కలుపు మందును తేలిక నేలల్లో ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలల్లో అయితే ఎకరాకు 1200 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం వల్ల వెడల్పాటి, కొన్ని గడ్డి జాతి కలుపు మొక్కలను దాదాపు ఒక నెల వరకు అదుపు చేయవచ్చు.సంకర రకాలలో మంచి దిగుబడి కోసం ఎకరానికి 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేయాలి. 1/3 వ వంతు నత్రజనిని, మొత్తం భాస్వరాన్ని, సగభాగం పొటాష్ ఎరువును ఆఖరి దుక్కిలో వేయాలి. మిగిలిన 1/3 వ వంతు నత్రజనిని 30-35 రోజులకు, మరో 1/3వ వంతు 50-55 రోజుల మధ్య వేయాలి. మిగతా 1/2వ వంతు పొటాష్ ఎరువును పూత దశలో వేసుకోవాలి. - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు, ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్