జాతిహితం
50 శాతానికి మించి రిజర్వేషన్లు అసలు సాధ్యమా? ఇదసలు సమస్యే కాదని ఆయనం టాడు. అందుకోసం ప్రత్యేక విధాన రూపకల్పనను ఆలోచించవచ్చని చెబుతాడు. ఇప్ప టికైతే ఆయన ప్రధాన లక్ష్యం తనను రాష్ట్రం నుంచి బయటకు వెళ్లగొట్టి, రాజస్థాన్‌లో గృహనిర్బంధంలో ఉంచిన మోదీ తాలూకు ప్రభుత్వాన్ని ఓడించడం ఒక్కటే. పాటీదార్ల ఆందోళన సందర్భంగా జరిగిన కాల్పుల్లో 15మంది మరణించడం, ఒక మహిళతో తన వ్యక్తిగత సంబంధాల వీడియోలు లీక్ కావడం ఆయన జీర్ణించుకోలేని అంశాలు.
గోడమీద రాత అనే రూపకాలంకారాన్ని మనం రెండు దశాబ్దాల నాడు ఉపయోగించాం. ఎన్నికల సమయంలో మాత్రమే కాదు, దేశంలో, ఇరుగు పొరుగున కూడా ఈ రాతలు నాకు కనిపించాయి. ఆ రాతలలో ఏం ఉందో కళ్లతో చదవడమే కాకుండా, వీనులతో జాగ్రత్తగా విన్నప్పుడు, దాని అర్థాన్ని ఆఘ్రాణించినప్పుడు ప్రజల అంతరాంతరాల్లోని భావాలను తెలుసుకోగలు గుతాం. ఏది మారింది? ఏది మారలేదు? అవి ఎందుకు? అనేవి అవగా హనకు వస్తాయి. అయితే ఇది అన్ని వేళలా కాకపోవచ్చు. ఆ రాతలతో ప్రజలు ఎవరికి ఓటు వేయదలిచారు? ఎవరిని వ్యతిరేకించదలిచారు అన్న విషయం కూడా బోధపడుతుంది. 2012 నాటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్కడి గోడల మీద రాతలను గమనించాం. మిగిలిన చోట్ల మాదిరిగా కాకుండా అక్కడ గ్రాఫిటీ లేదా వ్యాపార ప్రకటనలు దర్శనమి చ్చాయి. 2012లో మేం గోడల మీద రాతలు చదివినప్పుడు వేరే అర్థాన్ని స్ఫురిం పచేశాయి. జాతీయ రహదారుల పక్కల ఉండే కర్మాగారాలే ఆ గోడలు. తెలుపు, గ్రే రంగుల మీద సుదీర్ఘంగా కనిపించేవి. ఇంకా నీటితో నిండిన కాలువలు కనిపించేవి. విమానం మీద నుంచి చూస్తే నేలంతా జలాశయాలు, చెక్‌డ్యామ్‌లతో నిండి కనిపించేది. నీవు గుజరాత్ మీదుగా ప్రయాణిస్తున్న సంగతి తెలిసేది. అప్రతిహతమైన నరేంద్రమోదీ ఆ గోడ రాతలలో కనిపించేవారు.
మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో స్పష్టంగా కనిపించే అంశం ఆర్థికపరమైన, ఉద్యోగపరమైన ఒత్తిడి లేదు. ధనికుల మీద ఇతరుల మండిపాటు కూడా కనిపించేది కాదు. అలాగే నిరాశ కూడా ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఇదంతా మారిపోయింది. అయితే ఉత్తరప్రదేశ్‌లో కనిపించే నిరాశానిస్పృహలు మాత్రం అక్కడ కనిపించవు. కొంత అసంతృప్తి రాష్ట్రంలో ఉన్న మాట నిజం. ముఖ్యంగా యువతరం ఈ నిరాశను దాచడం లేదు. గ్రామాలను చూస్తుంటే పశ్చిమ బెంగాల్ గుర్తుకు వస్తుంది. నిరుద్యోగులు, యువకులు తోపులలో గుంపులు గుంపులుగా కనిపిస్తారు. ఆ తోపులలో వారు పొగ తాగుతూ, సెల్‌ఫోన్లు చూసుకుంటూ, చీట్ల పేక ఆడుతూ కాల క్షేపం చేయడం కనిపిస్తుంది. అయితే బెంగాల్‌లో కనిపించే నిరుద్యోగ యువత మాదిరిగా వారు పేదవారు కారు. చాలాసార్లు మోటారు బళ్లపై తిరు గుతూ కనిపిస్తారు. అయినా వారిలో ఎవరికీ ఉద్యోగాలు లేవు. లేదా ఒక ప్పుడు తాత్కాలిక ఉద్యోగాలు చేసినవారు. చరాల్ అనే గ్రామంలో ఒక తోపులో యువకులు మోదీ ఉపన్యాసాన్ని అనుకరించి చూపుతూ, నిరుద్యోగు లుగా తమ దుస్థితి గురించి తిట్టుకుంటూ కనిపించారు. ఈ తోపు టాటా నానో జోన్‌లో ఉంది. వీరిలో ఎక్కువ పాటీదారు వర్గానికి చెందిన యువ కులు. కాబట్టి వారిలో కొంత ఆగ్రహం ఊహించదగినదే. అయితే గుజరాత్‌లో ఇలాంటి దృశ్యమే సర్వసాధారణంగా కనిపిస్తుందని అనుకోనక్కర లేదు.
అహమ్మదాబాద్ గోడలకేసి చూడండి. ఏ ఇతర విశాలమైన ప్రదేశంలో అయినా పంజాబ్‌లో, మనకు పరిచితమైన ప్రకటనల రీతిలో వీటిని చిత్రించి ఉన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రకటనలు పెరు గుతున్నాయి. విదేశాల్లో తక్కువ నాణ్యతతో కూడిన విద్యకు సులభ ప్రవేశం గురించి ఇవి ప్రచారం చేస్తుంటాయి. గుజరాత్‌లోకూడా గతంలో ఇలాంటివి కొన్ని కనిపించేవి కానీ అంత అధిక సంఖ్యలో ఎప్పుడూ కనిపించలేదు. ఇప్పుడు కేవలం గోడలమీదే కాదు, చిన్న చిన్న హోర్డింగులపై, వీధి స్తంభాల కియోస్క్‌లపై, ఒంటిస్తంభాలపై ఒకేరకమైన సామగ్రి నిండి ఉంటోంది. బాగా అభివద్ధి చెంది ప్రస్తుతం అలసిపోయిన ప్రత్యేకించి పంజాబ్ వంటి ప్రాంతాల్లో అమెరికా, ఇంగ్లండ్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన వస్తు వులను చూడవచ్చు. కానీ గుజరాత్‌లో ఇవి ఇంత సంఖ్యలో కనిపించవు. ఇప్పుడు ఇలాంటి గమ్యస్థానాల్లో చేరాలనుకుంటే సాపేక్షికంగా ఒక కొత్త దేశం కూడా కనిపిస్తోంది. అది పోలెండ్. ఇప్పుడు పోలెండ్ విద్యాపరమైన గమ్య స్థానం కాదు కానీ మీరు నిరాశతో దేశం బయటకు వెళ్లాలనుకుంటే ఏ ప్రాంతమైనా మీకు సరిపోతుంది కదా. ఇది మూడు విషయాల గురించి మాట్లాడు తుంది: ఉన్నత విద్యకు తక్కువ అవకాశాలుండటం, కల్పిస్తున్న ఆ మాత్రం విద్య కూడా పేలవం గానూ, ఉద్యోగ కల్పనకు వీలివ్వనిదిగాను ఉండటం, అధిక నిరుద్యోగం. పంజాబ్ నుంచి వలస వెళుతున్న వారిలో అధికంగా ఆర్థిక పరమైన ఆశ్రయం కోసమే చూస్తున్నారు. గుజరాత్ విషయంలో ఇది వ్యాపా రానికి, వాణిజ్యానికి పరిమితమై ఉండేది. కాని ప్రస్తుతం మాత్రం గుజరాత్ నుంచి వలసల వెల్లు వకు ఆర్థిక ఒత్తిడి, నిరుద్యోగమే కారణం.
పాక్షికంగా పూర్తయిన ఒక భవంతిలో 24 సంవత్సరాల యువకుడిని చూశాము. గుజరాత్‌లో ప్రస్తుత నిరాశా వాతావరణానికి ఇతడు తన సొంత రాజకీయాలను వర్తింప చేస్తున్నాడు. ఇప్పుడు గుజరాత్ వీధుల్లోంచి పుట్టుకొ చ్చిన రెండో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా హార్దిక్ వెలిగిపోయాడు. ఇతడు పటీదార్ లేక పటేల్ కులానికి చెందినవాడు. వేలాదిమంది యువ పటేల్ కులస్తులు అతడి పిలుపును అనుసరిస్తున్నారు. వీరు టియర్ గ్యాస్, బుల్లెట్లను కూడా ఖాతరు చేయడం లేదు. హార్దిక్ చేపడుతున్న నిరసన ప్రద ర్శనలు, రోడ్ షోలను గమనిస్తే, 1980లలో అస్సాం విద్యార్థి నేతల ఆందోళన నాకు గుర్తుకొస్తుంది. అలాగే హార్దిక్ అనుయాయులు కూడా అతడిపై గుడ్డి విశ్వాసం ప్రదర్శిస్తున్నారు. అతడిప్పుడు గుజరాత్‌లో ఒక ఆరాధ్య వ్యక్తి. హార్దిక్ ముఖ్య డిమాండ్ ఓబీసీ హోదా, దాంతోపాటు తమ కులానికి ఉద్యో గాల్లో రిజర్వేషన్ మాత్రమే. హార్దిక్ రోడ్ షోలను గమనిస్తే, గుజరాత్‌లో రాజకీయంగా నరేంద్రమోదీ బద్దశత్రువులు కూడా ఆయనపై ఉపయోగించ నంత తీవ్రమైన భాషను మీరు వినవచ్చు. ఈ మాటలు వినిపించి నేను షాక్‌కు గురయ్యాను. ‘దేఖో, దేఖో, కౌన్ ఆయా, మోదీ తేరా బాప్ ఆయా‘ (ఎవరొచ్చారో చూడు, మోదీ, మీ నాన్న వచ్చాడు). 24 ఏళ్ల కుర్రాడి నోటి నుంచి వచ్చిన మాటలివి.
స్థానిక కళాశాలలో బీ కామ్ కోర్సుకోసం తన పేరు నమోదు చేసుకున్న ప్పటికీ హార్దిక్ విద్యార్థి రాజకీయాల్లోంచి పుట్టుకొచ్చినవాడు కాదు. అతడు పటేల్ ఖాప్ ఉద్యమం నుంచి రూపొందిన ఉత్పత్తి. ‘ఇతర కులాల నుంచి మన బాహు–బేటీలను కాపాడుకోవడానికి‘ అనే పేరిట సాగుతున్న తన సామాజికబంద కేంపెయిన్‌తో అతడు పూర్తిగా నిమగ్నమైపోయాడు.
నేనెందుకు పాపులర్ అయ్యానో తెలుసా? మ తాతముత్తాతలకు వంద ఎకరాల భూమి ఉండేది. కాని నాకు ఇప్పుడు రెండు ఎకరాల భూమి మాత్రమే ఉంది. మిగిలిన భూమి ఏమైంది? భూమిని అమ్ముకుంటూ బతుకుతూ వచ్చాం. ప్రతి పటేల్ కుటుంబం కూడా ఇదే దుస్థితిలో ఉంటోంది అన్నారు హార్దిక్. గుజరాత్‌లో ఉద్యోగం లేదా మంచి వ్యాపారం లేకుంటే ఎవరికీ పెళ్లి కాదు. ఇప్పుడు ఇవి రెండూ అందుబాటులో లేవు. కాబట్టి అబ్బాయిలకు పెళ్లే కాదు. అని చెప్పాడు. హార్దిక్‌ది సరికొత్త వాగాడంబరమే కావచ్చు కానీ అత్యంత స్పష్టతతో తను మాట్లాడుతున్నాడు. దీంతో అతని వయసుకు మించిన మేధస్సుకు మీరు దిగ్బ్రాంతి చెందుతారు లేదా అతడి జన్మదినం ధ్రువీకరణ పత్రాన్ని తనిఖీ చేయాలనుకుంటారు.
50 శాతానికి మించి రిజర్వేషన్లు అసలు సాధ్యమా? ఇదసలు సమస్యే కాదని ఆయనంటాడు. అందుకోసం ప్రత్యేక విధాన రూపకల్పనను ఆలోచించవచ్చని చెబుతాడు. ఇప్పటికైతే ఆయన ప్రధాన లక్ష్యం తనను రాష్ట్రం నుంచి బయటకు వెళ్లగొట్టి, రాజస్థాన్‌లో గృహనిర్బంధంలో ఉంచిన మోదీ తాలూకు ప్రభుత్వాన్ని ఓడించడం ఒక్కటే. పాటీదార్ల ఆందోళన సందర్భంగా జరిగిన కాల్పుల్లో 15మంది మరణించడం, ఒక మహిళతో తన వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన వీడియోలు లీక్ కావడం ఆయన జీర్ణించుకోలేని అంశాలు. తనను పోటీకి అనర్హుడైన యువకుడిగా చూడటం ఆయనకిష్టమే. అదే సమయంలో తనకు పదవులపై మోజు లేదంటారు. ఆయన గదిలో బాలాసాహెబ్ ఠాక్రే ఫొటో, ఉద్ధవ్, ఆదిత్యలతో తానున్న చిత్రాలు కనబడతాయి. బాలాసాహెబ్‌ను చాలా తెలివైనవాడని హార్దిక్ అంటారు. మీకు ఆయన ఆదర్శమా అని అడిగితే ఆయనకు ఎలాంటి పదవీ లేకపోయినా రాష్ట్రపతులు, ప్రధానులు ఆయనింటికి వచ్చేవారు. ఆయనతో కలిసి భోజనం చేసేవారు అని చెబుతాడు. అలా చెప్పినప్పుడు హార్దిక్ కళ్లు ఆరాధనతో మెరుస్తాయి.
హార్దిక్ తాను పాటీదార్ల బాలాసాహెబ్ కావాలని ఎలాంటి పదవీ, అధికారమూ లేకుండానే బల ప్రదర్శన ద్వారా అధికారం లభించాలని ఆశిస్తారు. గుజరాత్‌లో కొంత మార్పు కనబడుతోంది. 2002 తర్వాత ఇన్నాళ్లకు చాలామంది ప్రజలు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, తమ జీవన స్థితిగతులపై ఫిర్యాదు చేయడం వినబడుతుంది. అయితే విడిగా, దూరంగా ఉంటున్న ముస్లింలలో ఇది కనబడదు. ఎగ్జిట్ పోల్స్ నిజ మైతే... యోగేంద్ర యాదవ్ చెప్పారు గనుక అవి నిజమవుతాయనే ఆశిద్దాం– బీజేపీయే నెగ్గుతుంది. కానీ ఈ విజయంలో కూడా నరేంద్రమోదీ తనపట్ల ఏర్పడిన అసంతృప్తిని గమనించకుండా ఉండరు. ఇండియాటుడే ఎగ్జిట్ పోల్‌లో ఇందుకు సంబంధించిన సూచనలు కనబడతాయి. అన్ని వయ సులవారిలోనూ మోదీ ప్రాభవం బాగానే ఉంది. కేవలం 18–25 ఏళ్ల మధ్య వయస్కుల్లో మాత్రమే కాంగ్రెస్ ముందంజలో ఉంది. మోదీకి ఇదొక హెచ్చరిక లాంటిది. ఎందుకంటే ఈ వయసువారే ఆయన బలం. విద్యారంగ సంక్షోభం, ఉద్యోగాల లేమి, తయారీరంగంలో మాంద్యం, దాని ప్రభావం వాణిజ్యంపై పడటం వగైరాలన్నీ ఇందుకు కారణాలు కావొచ్చు. ఈ ఎగ్జిట్ పోల్ డేటా పెద్ద వయసువారిలో ఆయన పట్ల, బీజేపీ పట్ల విశ్వాసం చెక్కుచెదరలేదని చెబుతోంది. ఏతా వాతా యువతలోనే తేడా ఉంది. వారే తన భవిష్యత్తు అని మోదీకి తెలుసు.
ఈ ఎన్నికలో 2014నాటి 27 శాతం ఆధిక్యత బీజేపీకి అందివస్తుంది. అది ఇంత వ్యతిరేకతలోనూ ప్రత్యర్థులకంటే ముందంజలో ఉండేలా చేస్తుంది. కానీ పార్టీకి మరింత మెరుగైన స్థానిక నాయకత్వం, సంస్కరణల అవసరం ఉంది. లేనట్టయితే ఈ తేడా వేగం పుంజుకుంటుంది. నేను మొదటికెళ్లి లోగడ మార్చి చెప్పిన మాటను సరిచేసి శీర్షికను ‘గుజరాత్–2017 చేస్తున్న హెచ్చరిక’ గా మారుస్తాను.
వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్, శేఖర్ గుప్తా
twitter@shekargupta
Comments
Please login to add a commentAdd a comment