ఉమ్మడి హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పది మంది న్యాయమూర్తులు బుధవారం శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు.
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పది మంది న్యాయమూర్తులు బుధవారం శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే బుధవారం మధ్యాహ్నం వీరితో ప్రమాణం చేయించారు. ప్రమాణం చేసిన వారిలో జస్టిస్ ఆశపు రామలింగేశ్వరరావు, జస్టిస్ బులుసు శివశంకరరావు, జస్టిస్ మంథాట సీతారామ్మూర్తి, జస్టిస్ సారిపల్లె రవికుమార్, జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ తాళ్లూరి సునీల్ చౌదరి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ మిస్రిలాల్ సునీల్ కిషోర్ జైశ్వాల్, జస్టిస్ అంబటి శంకరనారాయణ, జస్టిస్ అనిస్‌లు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ప్రమాణం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.