మిషన్ కాకతీయకు సీడబ్ల్యూసీ ప్రశంసలు
Published Tue, Apr 4 2017 2:01 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నేతృత్వంలోని ఇంజనీర్ల బృందం ప్రశంసలు కురిపించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదేలా ఈ కార్యక్రమం ఉందని కితాబిచ్చింది. కరువు పీడిత ప్రాంతాలకు చెరువుల పునరుద్ధరణకు మించిన ఆయుధం మరొకటి లేదని అభిప్రాయపడింది. ఆదివారం నగరానికి వచ్చిన సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలోని 30 మంది ఇరిగేషన్ ఇంజనీర్ల బృందం సోమవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమయింది. సమావేశం అనంతరం ఈ బృందం పూర్వ మెదక్ జిల్లాలోని పలు చెరువులను పరిశీలించింది.
Advertisement