రేపటి నుంచి విజయవాడలో హెల్మెట్ ధరించటం తప్పనిసరి అని డీసీసీ కాంతిరాణా టాటా తెలిపారు.
విజయవాడ: రేపటి నుంచి విజయవాడలో హెల్మెట్ ధరించటం తప్పనిసరి అని డీసీసీ కాంతిరాణా టాటా తెలిపారు. హెల్మెట్ లేని వాహనదారులకు మొదటి సారి అయితే రూ.100 జరిమానాతో వదిలి వేస్తామని చెప్పారు. మళ్లీ మళ్లీ దొరికిపోతే జరిమానా మొత్తం పెరగటంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయనున్నామని అన్నారు.
నగరంలో రోడ్డు ప్రమాదాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయని, ఇందులో బాధితులు అధిక శాతం ద్విచక్రవాహనదారులేనని ఆయన చెప్పారు. శిరస్త్రాణం తనిఖీలకు విజయవాడలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, సిటీపోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.