హైదరాబాద్: ఏ ఎన్నికైనా టీఆర్ఎస్ పార్టీదే విజయమని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధిపేట మున్సిపాలిటీలో గెలుపొందిన అన్ని పార్టీల అభ్యర్థులకు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ కు భారీ విజయాన్ని అందించిన సిద్ధిపేట ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అడ్రస్ గల్లంతైందన్నారు. గెలిచిన ఇండిపెండెంట్లను టీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నట్టు ఆయన తెలిపారు.
కాగా సోమవారం విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 22 స్ధానాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ విజయం సాధించగా..ఏడు చోట్ల ఇండిపెండెంట్లు, రెండేసి చోట్ల బీజేపీ, కాంగ్రెస్ గెలవగా ఎంఐఎం ఒక స్థానంలో బోణి కొట్టింది. ఈ నెల 16 న చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్ధులను ప్రకటించనున్నారు.
'ఏ ఎన్నికైనా టీఆర్ఎస్దే విజయం'
Published Mon, Apr 11 2016 11:49 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM
Advertisement
Advertisement