శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేటు టూరిస్టు బస్సు అదుపుతప్పి 30 అడుగుల లోతులో పడి పోయింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.
బస్సు మంత్రాలయం నుంచి శ్రీశైలంకు వస్తుండగా బ్రేకులు ఫెయిలవడంతో శ్రీశైల ముఖ ద్వారం వద్ద అదుపుతప్పి లోయలోకి పడిపోయినట్టు సమాచారం. అయితే దట్టమైన చెట్లు ఉండడంతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.