ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం | Two militants killed in Kupwara gunfight | Sakshi
Sakshi News home page

ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

Published Thu, May 26 2016 4:35 PM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM

Two militants killed in Kupwara gunfight

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం కుప్వారా జిల్లాలోని నావ్ గామ్ సెక్టార్ లోని నియంత్రణ రేఖ వద్ద ఐదుగురు ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించడంతో భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు సీనియర్ పోలీస్ అధికారి స్పష్టం చేశారు.

 

ఈ రోజు ఉదయం రాష్ట్రీయ రైఫిల్స్(ఆర్ఆర్)  భద్రతా దళాలకు ఉగ్రవాదుల బృందం ఎదురుపడిందన్నారు. దీంతో ఇరు గ్రూపుల మధ్య హోరాహోరీ కాల్పులకు జరిగాయన్నారు.  ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను అంతమొందించామని, మిగతా ఉగ్రవాదుల కోసం స్థానిక అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగిస్తున్నామని పోలీస్ అధికారి పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement