అప్పుల భారం, కుటుంబ సమస్యలతో ఓ మహిళా రైతు ఆత్మహత్యకు పాల్పడింది.
ఇటిక్యాల: అప్పుల భారం, కుటుంబ సమస్యలతో ఓ మహిళా రైతు ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం ఉద్దండాపురం గ్రామానికి చెందిన పోలీసు శరత్‌కుమార్‌రెడ్డి, జయంతి(30) దంపతులు తమకున్న నాలుగున్నర ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే, శరత్‌కుమార్ రెడ్డి మద్యానికి బానిసై కుటుంబ వ్యవహారాలు పట్టించుకోకపోవటంతో జయంతి వ్యవసాయ పనులు చూసుకుంటోంది. ఈ ఏడాది సాగు చేసిన పత్తి, మిర్చి ఆశాజనకంగా లేకపోవటంతోపాటు అప్పులు రూ.10 లక్షలకు పెరిగిపోవటంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె సోమవారం ఉదయం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.