పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ తగాదాలతో భార్యను ఓ వ్యక్తి సుత్తితో కొట్టి దారుణంగా హతమార్చాడు.
హైదరాబాద్: పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ తగాదాలతో భార్యను ఓ వ్యక్తి సుత్తితో కొట్టి దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన పాతబస్తీలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్‌లో సోమవారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న వెంకటేష్, కల్పన భార్యాభర్తలు. వీరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ఇద్దరి మధ్య తగాదా జరగడంతో కోపోద్రిక్తుడైన వెంకటేష్ సుత్తితో తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.