సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ (కేఐపీసీ)కి ఆంధ్రాబ్యాంకు రూ.1,300 కోట్ల రుణం మంజూరు చేసింది. ప్రాజెక్టు నిర్మాణ కన్సార్షియంలో లీడ్ బ్యాంకుగా వ్యవహరించేందుకు గతంలోనే ఆంధ్రాబ్యాంకు ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.17,500కోట్లలో రూ.7,400 కోట్ల టర్ము లోను ఇవ్వడానికి అంగీకరించింది.
మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం (లింక్–1)కు అవసరమైన రూ.9,250 కోట్ల నిధులపై కేఐపీసీ ప్రతిపాదనలను బ్యాంకుకు అందజేసింది. దీంతో రూ.1300 కోట్ల టర్ము లోనును మం జూరు చేస్తూ నిబంధనలను ప్రభుత్వానికి తెలిపింది. ప్రాజెక్టు వ్యయంలో 20% మార్జిన్ మనీగా రూ.325కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం దీనికి అంగీకరిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాళేశ్వరానికి 1,300 కోట్ల రుణం
Published Sun, Feb 5 2017 12:46 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM
Advertisement
Advertisement