సాక్షి,హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలను సాధ్యమైనంత త్వరగా విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. ఈ నెల 17,18 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం టెన్త్ ఫలితాలను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. తెలంగాణ కన్నా రెండు రోజులు ముందుగానే ఫలితాలను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది. మిగతా ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి ఈ నెల 14 లేదా 15 తేదీల్లో టెన్త్ ఫలితాలను విడుదల చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టింది.