సూత్రప్రాయంగా అంగీకరించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు సూత్రప్రాయంగా అంగీకరించింది. మంగళవారం హైదరాబాద్‌లో ఈ అంశంపై పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్‌తో బ్యాంకు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. పారదర్శక విధానాలు, నమూనాలతో మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఎస్‌పీ సింగ్ పేర్కొన్నారు.
దేశంలోని ప్రముఖ ఆర్థిక సంస్థలన్నీ మిషన్ భగీరథలో భాగస్వాములయ్యాయని వివరించారు. కాగా రుణం మంజూరుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు పంజాబ్ నేషనల్ బ్యాంకు సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, పంజాబ్ నేషనల్ బ్యాంకు జోనల్ మేనేజర్ వినోద్ జోషి, తెలంగాణ విభాగం హెడ్ రాజీవ్ పురి తదితరులు పాల్గొన్నారు.
మిషన్ భగీరథకు రూ.2వేల కోట్ల రుణం
Published Wed, Sep 14 2016 3:27 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM
Advertisement
Advertisement