
30 జిల్లాలు అనవసరం: జైపాల్‌రెడ్డి
కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి
హైదరాబాద్: కొత్త జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని... అరుుతే ప్రస్తుతం 30 జిల్లాలు అవసరం లేదని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ గా చేయాలని డిమాండ్ చేస్తూ కల్వకుర్తి నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మేల్యే వంశీచంద్‌రెడ్డితోపాటు వివిధ పార్టీల నాయకులు సోమవారం ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్ష చేశారు. దీక్షలకు మద్దతు ప్రకటించిన జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. శాస్త్రీయంగా, హేతుబద్ధంగా జిల్లాలను చేయాల్సి ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టారాజ్యంగా చేస్తున్నారని, టీఆర్‌ఎస్‌కు జిల్లాల ఏర్పాటు అంటే విలువ లేకుండా పోరుుందని విమర్శించారు.
కల్వకుర్తి నిజాం హయాంలోనే తాలూకాగా ఉందని, అది తెలియని కేసీఆర్‌కు తెలంగాణ గురించి ఏం తెలుసని అన్నారు. కల్వకుర్తిని రెవిన్యూ డివిజన్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయం మేరకు జిల్లాల పునర్విభజన చేయాల్సి ఉండగా కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత జానారెడ్డి అన్నారు. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు 40 రోజులుగా పార్టీలకతీతంగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని వైఎస్సార్‌సీపీ నాయకులు శివకుమార్ పేర్కొన్నారు. కల్వకుర్తి డివిజన్ చేయాలనే డిమాండ్‌కు వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు.
తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొనసాగుతున్నాయని, ధర్నాలు, నిరసనలు, నిరాహార దీక్షలు నిత్యకృత్యంలా మారాయని టీటీడీపీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పని చేయడం లేదన్నారు. నియోజకవర్గాల విభజన తర్వాతే జిల్లాల విభజన చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి.. ఇప్పుడు హడావిడిగా జిల్లాల విభజన ఎందుకు చేస్తున్నారని ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి పశ్నించారు. మాట తప్పినందుకు కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ కోసం ఇక నుంచి జరిగేది ఉద్యమం కాదని.. ప్రజా యుద్ధమేనని అన్నారు. ఎంపీ నంది ఎల్లయ్య, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.