మరో రెండ్రోజులు తీవ్ర వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే వడదెబ్బతో 55 మంది మృతి చెందారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 13 మంది చొప్పున, వరంగల్‌లో 11 మంది, కరీంనగర్‌లో 8 మంది, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో ముగ్గురు, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృత్యువాత పడ్డారు.
మరో రెండ్రోజులపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, నల్లగొండ జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. నాలుగు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. రామగుండంలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది.
ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు
ప్రాంతం ఉష్ణోగ్రత
రామగుండం 46.0
హన్మకొండ 44.8
భద్రాచలం 45.4
ఆదిలాబాద్ 44.3
నిజామాబాద్ 43.1
ప్రాంతం ఉష్ణోగ్రత
ఖమ్మం 44.2
నల్లగొండ 43.2
మెదక్ 42.4
హైదరాబాద్ 40.8
మహబూబ్‌నగర్ 39.8