పాతబస్తీలో బాలుడి హత్య | 8 years old boy murdered in old city | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో బాలుడి హత్య

Published Fri, Sep 22 2017 3:40 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

పాతబస్తీలో ఎనిమిదేళ్ల బాలుడిని అతడి సమీప బంధువు కిడ్నాప్‌ చేసి హత్య చేశాడు.

సాక్షి, హైద‌రాబాద్ :  పాతబస్తీలో ఎనిమిదేళ్ల బాలుడిని అతడి సమీప బంధువు కిడ్నాప్‌ చేసి హత్య చేశాడు. వివరాలు..రెయిన్‌బజార్‌కు చెందిన అబ్బాస్‌ హసన్‌ రజ్వీ కుమారుడు షబ్బీర్‌ను అతని సమీప బంధువు జావేద్‌ పండ్ల రసం తాగుదామని నమ్మబలికి ఎవరి కంట పడకుండా ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లాడు.
 
బాలుడిని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి బండరాయితో తలపై మోది హత్య చేశాడు. బాలుడు ఎంతకీ తిరిగి రాకపోయే సరికి అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు డబీపురాలో బాలుడి శవాన్ని కనుగొన్నారు. అనుమానం వచ్చిన పోలీసులు జావేద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నాడు. బాలుడి తండ్రితో ఉన్న పాతకక్షల కారణంగానే బాలుడిని హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement