మేనత్తను వేధిస్తున్నాడని మామను చంపిన అల్లుడు | nephew kills his uncle over harrassment | Sakshi
Sakshi News home page

మేనత్తను వేధిస్తున్నాడని మామను చంపిన అల్లుడు

Published Thu, May 15 2014 8:46 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

మేనత్తను వేధిస్తున్నాడని మామను చంపిన అల్లుడు - Sakshi

మేనత్తను వేధిస్తున్నాడని మామను చంపిన అల్లుడు

మేనత్తను వేధిస్తున్నాడని ఆమె భర్తను మేనల్లుడు దుడ్డుకర్రతో కొట్టి చంపాడు. పాతబస్తీలోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

మేనత్తను వేధిస్తున్నాడని ఆమె భర్తను మేనల్లుడు దుడ్డుకర్రతో కొట్టి చంపాడు. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. జియాగూడ ఇందిరానగర్ నివాసి నర్సింహ (22) కూలీ. ఇతని మేనత్త అనూరాధను బంజారాహిల్స్‌కు చెందిన హన్మంతు (28)కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిపించారు. కూలీ అయిన హన్మంతు నిత్యం తాగి వచ్చి అనూరాధను హింసించేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చి ఉండేది. కొద్ది రోజులకు హన్మంతు వచ్చి సర్దిచెప్పి తన వెంట తీసుకెళ్లేవాడు.

నాలుగు రోజుల క్రితం భర్త తాగి వచ్చి కొట్టడంతో అనూనురాధ మళ్లీ పుట్టింటికి వచ్చేసింది. మంగళవారం మధ్యాహ్నం హన్మంతు భార్యను తీసుకెళ్లేందుకు జియాగూడకు రావడంతో గొడవ జరిగింది. ఆ తర్వాత నర్సింహ, హన్మంతు కలిసి బయటకు వెళ్లి.. మద్యం తాగి ఇంటికి చేరుకున్నారు. అనూరాధ, హన్మంతుల మధ్య మళ్లీ గొడవ జరిగింది. అక్కడే ఉన్న నర్సింహ తీవ్ర ఆగ్రహానికి గురై.. పక్కనే ఉన్న దుడ్డు కర్రతో హన్మంతు తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిన హన్మంతును పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం హన్మంతు మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement