
పోలీసులు స్వాధీనం చేసుకున్న కల్తీ నెయ్యి డబ్బాలు
బంజారాహిల్స్: కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై జూబ్లీహిల్స్ పోలీసులు దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున నకిలీ నెయ్యి డబ్బాలు, తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యూసుఫ్‌గూడ సంజయ్‌నగర్‌కు చెందిన ఎండీ రజియుద్దీ¯ŒS గతంలో పాత బస్తీలోని ఓ కల్తీ నెయ్యి తయారీ కేంద్రంలో పని చేసిన అనుభవంతో రెండేళ్ల క్రితం స్వయంగా సంజయ్‌నగర్‌లోని ఓ ఇంట్లో తన స్నేహితులు ఎండీ రియాజ్, అబ్దుల్ గఫార్, ఇబ్రహీంలతో కలిసి కల్తీ నెయ్యిని తయారు చేస్తూ స్వీట్‌షాపులు, హోటళ్లకు సరఫరా చేసేవాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఇంటిపై దాడులు నిర్వహించి నెయ్యి తయారు చేస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి మూడు నెయ్యి డబ్బాలు, వనస్పతి తదితర సామగ్రిని సీజ్ చేశారు. వీరిపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.