ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో కొత్త ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ.200 కోట్ల నిధులు కేటాయించినా విడుదల చేయడం లేదంటూ సీనియర్ సిటిజన్స్ స్వచ్ఛంద సంస్థ రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది.
- ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనంపై సీనియర్ సిటిజన్స్ లేఖ
- పిల్‌గా పరిగణించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో కొత్త ఆస్పత్రి భవన నిర్మాణానికి రూ.200 కోట్ల నిధులు కేటాయించినా విడుదల చేయడం లేదంటూ సీనియర్ సిటిజన్స్ స్వచ్ఛంద సంస్థ రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది. ఈ లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.
ఉస్మానియా ఆస్పత్రిలో చాలాభాగం కూలిపోయే దశలో ఉందని, కొత్త ఆస్పత్రి భవనానికి రూ.200 కోట్లు కేటాయించిందని పేర్కొంది. ఇప్పటి వరకు రూ.6 కోట్లే విడుదల చేశారని తెలిపింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరింది. దీనిపై స్పందించిన కోర్టు పిల్‌గా విచారణకు స్వీకరించింది.