-టీ హబ్‌ను సందర్శించిన అమెరికా ఉప సహాయ కార్యదర్శి ఏంజెలా
-బ్రెగ్జిట్ పరిణామాలపై ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు వెల్లడి
-ఎన్‌ఎస్‌జీ అంశంతో మద్దతు కొనసాగుతుందని ప్రకటన
హైదరాబాద్: భారత్‌తో అమెరికా మైత్రీ బంధానికి ఉజ్వల భవిష్యత్తు వుంటుందని అమెరికా విదేశాంగ శాఖ దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఏంజిలా ప్రైస్ అగ్లేర్ వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులపై ( క్లైమేట్ ఛేంజ్) రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఏంజెలా.. శనివారం హైదరాబాద్‌లోని టీ హబ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. టీ హబ్‌లోని స్టార్టప్‌ల సీఈఓలతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. దశాబ్దాల తరబడి కొనసాగుతూ వస్తున్న భారత్, అమెరికా సంబంధాలు.. ఇటీవలి కాలంలో మరింత బలోపేతం అయ్యాయన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి వాషింగ్టన్ పర్యటన.. అమెరికా కాంగ్రెస్‌లో మోడి చారిత్రాత్మక ప్రసంగం.. ఇరు దేశాల సంబంధాల్లో మైలురాయి వంటివని వ్యాఖ్యానించారు. భారత్‌తో సంబంధాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా అత్యంత ఆసక్తితో వున్నారన్నారు. మిలిటరీ, రక్షణ, ఇంధనం, ఆర్దిక అంశాలు.. తదితరాల్లో భారత్‌తో తాము బలమైన సంబంధాలను కోరుకుంటున్నట్లు ఏంజెలా వెల్లడించారు. వాణిజ్య సంబంధాల పరంగా భారీగా వృద్ది సాధించే అవకాశం ఇరు దేశాలకు వుందన్నారు. 130 కోట్ల జనాభా కలిగిన భారత్‌లో 40శాతం మంది 20ఏళ్ల లోపు వారే కావడంతో భారీ వృద్దిరేటుకు అవకాశం వుందన్నారు. కేవలం ఏడాది వ్యవధిలో అమెరికాతో పాటు విదేశీ పెట్టుబడుల్లో హైదరాబాద్ 27శాతం వృద్ది రేటు సాధించడాన్ని ఏంజెలా ప్రస్తుతించారు.
బ్రెగ్జిట్ పరిణామాలపై ఆసక్తి ప్రజాస్యామ్యాన్ని ముఖ్యమైన, సంక్షిష్టమైన వ్యవస్తగా పేర్కొన్న ఏంజెలా.. బ్రెగ్జిట్‌కు బ్రిటన్ పౌరులు అనుకూలంగా ఓటు వేయడాన్ని ఏంజెలా ప్రస్తావించారు. బ్రెగ్జిట్ పరిణామాలపై భారత్ తరహాలో తామూ ఆసక్తితో ఎదురుచూస్తున్నామన్నారు. అక్కడి వ్యవస్త గాడిన పడేందుకు కనీసం రెండేళ్లు పడుతుందని అంచనా వేస్తున్నామన్నారు. అణు సరఫరా బృందంలో ఇతర దేశాల వైఖరిపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని.. అయితే సభ్యత్వం విషయంలో భారత్‌కు తమ మద్దతు కొనసాగుతుందని ఏంజెలా వ్యాఖ్యానించారు. వాతావరణ మార్పులపై ప్యారిస్‌లో భారత్, అమెరికాతో సహా పలు దేశాల నడుమ కుదిరిన ఒప్పందాన్ని ఆచరణలోకి తేవడంపై దృష్టి సారించామన్నారు.
టీ -హబ్ పనితీరు భేష్ టీ హబ్ పనితీరు అద్భుతంగా వుందని.. గత నెలలో ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన సందర్భంగా కాలిఫోర్నియాలోని ఐ హబ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ప్రస్తావించారు. ఈ రెండు ప్రముఖ హబ్‌ల నడుమ కుదిరిన ఒప్పందం.. క్లైమేట్ ఛేంజ్‌ను ఎదుర్కొనేందుకు ఔత్సాహికులకు ప్రోత్సాహంగా వుంటుందన్నారు. ఔత్సాహికులకు ప్రోత్సాహం, శిక్షణ , అభివృద్ది, పెట్టుబడులు సమకూర్చడం ద్వారా టీ హబ్.. యువతకు కొత్త అవకాశాలు లభించేందుకు తోడ్పడుతుందన్నారు. 20 ఏళ్లుగా హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. ఆవిష్కరణలకు హైదరాబాద్ కేంద్రంగా మారుతోందని ఏంజెలా ప్రైస్ అగ్లెర్ వ్యాఖ్యానించారు.
భారత్‌తో అమెరికా మైత్రికి ఉజ్వల భవిష్యత్
Published Sat, Jun 25 2016 7:01 PM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM
Advertisement