సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాల కోసం విద్యార్థులు గురువారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్య డెరైక్టర్ కిషన్ ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ మినహా మండలాలవారీగా మోడల్ స్కూళ్ల జాబితా, వాటి మార్గదర్శకాలను http://telanganams.cgg.gov.in/లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 7 నుంచి 9 వరకు విద్యార్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతామన్నారు.
ఇదీ ప్రవేశాల షెడ్యూల్...
మే 19 నుంచి జూన్ 2 వరకు: ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ
20-5-2016 నుంచి 3-6-2016 వరకు: ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రింట్ కాపీ, ఇతర సర్టిఫికెట్లను పాఠశాలల్లో అందజేయడం
3-6-2016: సీజీజీ నేతృత్వంలో అభ్యర్థుల జాబితా రూపకల్పన
3-6-2016: స్కూళ్లు, జిల్లాలవారీగా మెరిట్ జాబితాల తయారీ
6-6-2016: స్కూళ్ల వారీగా ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రకటన
7-6-2016 నుంచి 9-6-2016 వరకు: ఎంపికైన విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు రేపట్నుంచి దరఖాస్తులు
Published Wed, May 18 2016 3:48 AM | Last Updated on Sat, Sep 15 2018 4:26 PM
Advertisement
Advertisement