భారీ వర్షాల నేపథ్యంలో సర్కారు అప్రమత్తం
- సచివాలయంలో కంట్రోల్ రూం.. ఫోన్ నం. 040-23454088
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే కురుస్తున్న కుండపోతకు తోడు మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. హైదరాబాద్‌లో సహాయక చర్యలు చేపట్టేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు సచివాలయంలో కంట్రోల్ రూమ్‌ను (హెల్ప్‌లైన్ నంబర్ 040-23454088) ఏర్పాటు చేసింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభా గం అసిస్టెంట్ కమిషనర్ బద్రీనాథ్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించింది. ఆపదలో ఉన్నవారు కంట్రో ల్ రూమ్‌కు సమాచారమివ్వాలని సూచించింది.
భారీ నష్టం: వరుసగా కురిసిన వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నష్టం వాటిల్లింది. దాదా పు 353 గ్రామాలు, 12,867 కుటుంబాలు వరదల్లో చిక్కుకున్నాయి. 600 ఇళ్లు దెబ్బతిన్నాయి. 5 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి.. 2,472 మందిని శిబిరాలకు తరలించి నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కుంట లు, చెరువులకు గండ్లు పడటం, రోడ్లు కొట్టుకుపోవడం వంటి 56 సంఘటనలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్‌లో అపార నష్టం సంభవించింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 5.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
గ్రేటర్‌పై ప్రత్యేక దృష్టి...
గత రెండు రోజుల్లోనే హైదరాబాద్ నగర పరిధిలో 16.4 సెం.మీ. వర్షపాతం నమోదుకావడంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు, నాలాలు పొంగుతున్నాయి. ఇక మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం జల దిగ్బంధంలో చిక్కుకున్న 18 ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలను ముమ్మరం చేసింది. శుక్రవారం రాత్రి నుంచే ఎన్‌డీఆర్‌ఎఫ్, సైనిక బృందాలను రంగంలోకి దింపాలంటూ.. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర కేంద్రానికి, ఎన్‌డీఆర్‌ఎఫ్ కు లేఖ రాశారు. సీఎం ఆదేశం మేరకు 60 మందితో కూడిన ఆర్మీ బృందాన్ని అధికారులు సిద్ధంగా ఉంచారు.
రంగంలోకి సైన్యం!
Published Sat, Sep 24 2016 2:22 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
Advertisement
Advertisement