సెల్ఫీ దిగాలంటే..‘పేటీఎం’ చేయాల్సిందే! | ARTIST Collection of Donations | Sakshi
Sakshi News home page

సెల్ఫీ దిగాలంటే..‘పేటీఎం’ చేయాల్సిందే!

Published Mon, May 8 2017 3:04 AM | Last Updated on Tue, Sep 5 2017 10:38 AM

సెల్ఫీ దిగాలంటే..‘పేటీఎం’ చేయాల్సిందే!

సెల్ఫీ దిగాలంటే..‘పేటీఎం’ చేయాల్సిందే!

వినూత్న రీతిలో ఓ కళాకారుడి విరాళాల సేకరణ  

హైదరాబాద్‌: భుజాన క్రికెట్‌ బ్యాట్‌తో హుషారుగా మెట్లు దిగుతున్న ఇతని పేరు నూకాజీ. చదువుకున్నది గ్రాడ్యుయేషన్‌. అయినా కళల పట్ల మక్కువతో దాన్నే జీవనాధారంగా చేసుకున్నాడు. ఇటీవల ఏర్పడిన నగదు కొరతతో రాబడి తగ్గిపోవడంతో ఓ ఉపాయంగా ‘పేటీఎం’ద్వారా ఆన్‌లైన్‌ విరాళాలు స్వీకరిస్తున్నాడు.

ప్రతి ఆదివారం హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, నెక్లెస్‌ రోడ్డులో ఇలా వివిధ వేషధారణలతో పేటీఎం ట్యాగ్‌తో కనిపిస్తూ అందరినీ ఆకర్షిస్తు్తన్నాడు. ఇతనితో దిగే మొదటి సెల్ఫీ ఉచితం. తరువాత దానికి మాత్రం పేటీఎం ద్వారా పేమెంట్‌ చేయాల్సిందే. మూసాపేట మెట్రో రైల్వే స్టేషన్‌ వద్ద ఆదివారం కనిపించిన దృశ్యం ఇది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement