అచ్చెన్నాయుడికి స్పీకర్ మందలింపు
హైదరాబాద్: శాసనసభ వేదికగా ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు మరోసారి నోరు పారేసుకున్నారు. సభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దుర్భాషలాడారు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారికి సంతాపంగా సోమవారం అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... తొక్కిసలాట జరగడానికి సీఎం చంద్రబాబే కారణమని ఆరోపించారు. దీంతో అధికార సభ్యులు జగన్ ప్రసంగానికి అడ్డుతగిలారు. గోదావరి పుష్కరాలపై రోజంతా చర్చకు సిద్ధమంటూనే మంత్రి అచ్చెన్నాయుడు ఒంటికాలిపై లేచారు. జగన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. స్పీకర్ మందలించడంతో అచ్చెన్నాయుడు వెనక్కి తగ్గారు. తొక్కిసలాట ఘటనపై ప్రతిపక్ష నేత నిలదీయడంతో ప్రభుత్వం ఇరుకున పడడంతో టీడీపీ సభ్యులు తమ నోటికి పనిచెప్పారు.