
రన్ మిషన్
ఆయనది ’రన్’తంత్రం. పరుగు యుంత్రం. ఇప్పటి వరకు 40కి పైగా మారథాన్లు, 250కి పైగా రోడ్డు రేస్‌ల్లో పాల్గొన్నాడు. వయుసు 65 ఏళ్లు. ఇంకా పరుగు దాహం తీరలేదు. ఇంతకీ ఆయునెవరంటారా..! అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ రన్నింగ్ కోచ్ బిల్ పియర్స్. ఆదివారం నగరంలో జరగనున్న ఎయిర్‌టెల్ మారథాన్ ఈవెంట్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. నగరంలోని లెమన్‌ట్రీ ప్రీమియర్‌లో గురువారం జరిగిన ఈవెంట్ బ్రోచర్ ఆవిష్కరణలో పాల్గొన్న పియుర్స్‌ను ‘సిటీ ప్లస్’ పలుకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే...
భారత్‌లో మారథాన్ ఈవెంట్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి.
హైదరాబాద్ మారథాన్ కోసం ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. హాఫ్ మారథాన్‌లో మెరుగైన ప్రదర్శన కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా. అమెరికా దక్షిణ కరోలినాలోని ఫర్మన్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పనిచేస్తున్నా. ఫర్మన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రన్నింగ్ అండ్ సైంటిఫిక్ ట్రైనింగ్‌కు సహ వ్యవస్థాపకుడిని కూడా. శారీరక వ్యాయామాల గురించి క్లాస్‌లు తీసుకుంటా. విద్యార్థులను జాగృతి చేస్తుంటా.
ఎంత చూసినా తనివితీరదు...
హైదరాబాద్ బ్యూటిఫుల్ సిటీ. నగర అందాలను ఎంత చూసినా తనివి తీరదు. గురువారం ఉదయం కేబీఆర్ పార్క్‌లో వాకింగ్ కూడా చేశా. నగర రోడ్లు, ఫ్లైఓవర్లు, చెట్లు, కొండలు, చారిత్రక కట్టడాలు కనువిందు చేస్తున్నాయి. గోల్కొండ, చార్మినార్, సెవెన్ టూంబ్స్ అద్భుతం. ఇక్కడి వాతావరణం అన్ని దేశాల ప్రజలు జీవించేందుకు అనువుగా ఉంది. వంటకాలు అదుర్స్. స్పైసీ ఫుడ్ వెరీ గుడ్.
ఇరానీ టీ తాగితే... ఆ మజానే వేరు.
మార్గదర్శనం చేస్తున్నా...
మారథాన్‌లో అంతర్జాతీయ కోచ్‌ని. ప్రస్తుతం ఇక్కడి మారథాన్‌లో పాల్గొనే రన్నర్స్‌కు మార్గదర్శనం చేస్తున్నా. ఎత్తుపల్లాలు, ఫ్లైఓవర్లు... ఇలా డిఫరెంట్ ప్రాంతాల మీదుగా పరుగులు తీయాల్సి ఉంటుంది. ఈ క్రవుంలో స్పీడ్ మెయింటెనెన్స్, టైమింగ్ ఎలా ఉండాలి తదితర అంశాలపై సలహాలిస్తున్నా. లక్ష్యాన్ని ఛేదించాలన్న తపన ఇక్కడి రన్నర్లలో బాగా కనిపిస్తోంది. రన్ పట్ల డెడికేషన్ ఉంది.
రెడీ టు మారథాన్...
నగరంలో ఎయిర్‌టెల్ హైదరాబాద్ మారథాన్ సందడి మొదలైంది. ఈ ఈవెంట్‌కి మరో రెండు రోజులు మాత్రమే ఉంది. రేస్ వీకెండ్ ప్రారంభమైనట్టు ఎయిర్‌టెల్, హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి శనివారం మధ్యాహ్నం రెండు గంటల వరకు అల్ట్రా మారథాన్ రన్నర్ అర్జున్ భరద్వాజ్ పరుగెత్తుతాడు. అదే రోజు మారథాన్‌లో పాల్గొనే రన్నర్ల కోసం మాదాపూర్ హైటెక్స్‌లో మారథాన్ ఎక్స్‌పో నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల పరుగు వీరులు ఇందులో పాల్గొంటారు.
రేపటి వరకు అవకాశం...
మారథాన్‌లో పాల్గొనాలనుకునే వారికి శనివారం వరకు రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం ఉంది. ఆసక్తి కలిగినవారు http://www.marathonhyderabad.com/లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. లేదంటే... హైటెక్స్‌లో జరిగే ఎక్స్‌పోలో ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు నేరుగా వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు.