ఓయూలో సీసీ కెమెరాలు ఎందుకు?: పీసీసీ | CC cameras why in OU? : PCC | Sakshi
Sakshi News home page

ఓయూలో సీసీ కెమెరాలు ఎందుకు?: పీసీసీ

Published Thu, May 26 2016 3:21 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM

CC cameras why in OU? : PCC

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం లో కీలకపాత్ర పోషించిన ఉస్మానియా వర్సిటీలో సీసీ కెమెరాలెందుకు పెడుతున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రధాన కార్యదర్శి మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. గాంధీభవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... బంగారు తెలంగాణ చేస్తామని చెబుతున్న టీఆర్‌ఎస్.. ప్రజాస్వామ్యవాదుల గొంతు నొక్కుతుందన్నారు.

తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనడానికి వెళ్లిన ప్రజాస్వామ్యవాదులు, ప్రొఫెసర్లను అరెస్టు చేయడం కంటే నియంతృత్వం ఉండదన్నారు. ఎన్నికలకు ముందు నక్సలైట్ల ఎజెండానే తమ ఎజెండా అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు అరెస్టులకు దిగుతున్నారన్నారు. సభలు నడుపుకోవాలంటే హైకోర్టుకు పోవాల్సిన దుస్థితిని రాష్ట్రంలో టీఆర్‌ఎస్ తెచ్చిందన్నారు. మోదీ ప్రభుత్వంలో మాటలు తప్ప చేతల్లేవంటూ దుయ్యబట్టారు. నల్లధనం వెనక్కి తెచ్చి కుటుంబానికి రూ.15 లక్షలను జమచేస్తామని చెప్పి, మోసం చేశారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement