
పెద్దనోట్ల రద్దుతో సామాన్యులకు అవస్థలు: చాడ
ఖమ్మం మయూరిసెంటర్: పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు అవస్థ పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మంలో సీపీఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా మహాసభలు జరిగాయి. చాడ మాట్లాడుతూ నల్లధనం వెలికితీత, స్వచ్ఛభారత్ అంటూ మోదీ అధికారంలోకి వచ్చారని, రెం డున్నరేళ్లు గడిచినా నల్లధనం ఊసెత్తలేదన్నారు. విదేశీ పర్యటనలో ప్రధానమంత్రి కార్పొరేట్ సేవల్లో తరిస్తున్నారని ఆరోపించారు. దేశంలో మతోన్మాద చర్యలు పుంజుకుంటున్నాయని, కార్పొరేట్ శక్తులు ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.