సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్టోబర్ మొదటి వారంలో సచివాలయంలోని ‘ఎల్’ బ్లాకులోని ఎనిమిదో అంతస్తు నుంచే పరిపాలన సాగించనున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వెల్లడించారు. సచివాలయంలో తనను కలిసిన విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు.