రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ | cm kcr meeting with district collectors from pragathi bhavan | Sakshi
Sakshi News home page

రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ

Published Tue, Dec 13 2016 7:12 PM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM

రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ - Sakshi

రేపు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం సమావేశంకానున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రగతి భవన్లో ఈ భేటీ జరగనుంది. కలెక్టర్ల సమావేశంలో చర్చించాల్సిన 20 అంశాల ఎజెండాను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.
 
రాష్ట్రంలో నోట్ల రద్దుతో ప్రజల పడుతున్న ఇబ్బందులు,  నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన, మిషన్ కాకతీయ పనులపై జిల్లా కలెక్టర్లు, అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు హాజరవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement