వేల కోట్లు విలువ చేసే భూముల కేసులు ఏళ్ల తరబడి నడుస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
హైదరాబాద్: వేల కోట్లు విలువ చేసే భూముల కేసులు ఏళ్ల తరబడి నడుస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూవివాదాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు.
భూములు కేసుల్లో ఉండటం వల్ల ప్రజల అవసరాలకు వాడలేకపోతున్నామని ఆయన చెప్పారు. గతంలో ప్రభుత్వ అండదండతోనే భూముల ఆక్రమణలు జరిగాయని ఆయన అన్నారు. జిల్లాలోనూ ప్రభుత్వ భూముల కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని చెప్పారు.