ఎన్నికల ఏర్పాట్లు పూర్తి : ఆనంద్ | Complete arrangements for All polls, says Cyberabad Commissioner | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఏర్పాట్లు పూర్తి : ఆనంద్

Published Thu, Mar 27 2014 12:59 PM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM

ఎన్నికల ఏర్పాట్లు పూర్తి : ఆనంద్

ఎన్నికల ఏర్పాట్లు పూర్తి : ఆనంద్

ఎన్నికల నేపథ్యంలో తమ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు రూ.5.40 కోట్లు సీజ్ చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. గురువారం సైబరాబాద్ కమిషనరేట్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ...రూ. 5.60 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసినట్లు తెలిపారు. అలాగే 1,407 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

1,462 మంది తమ వద్ద ఉన్న ఆయుధాలు పోలీసులకు అప్పగించారన్నారు.ఎన్నికల కోసం 8,478 మంది సివిల్ పోలీసులు..30 కంపెనీల పారా మిలిటరీ బలగాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.ఎవరైన సభలు,సమావేశాలు,ర్యాలీలు నిర్వహించాలంటే  అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని ఆయన సూచించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.మీర్పేటలో పోలీసులపై దాడికి పాల్పడిన ఇండిపెండెంట్ అభ్యర్థి యాదయ్య నామినేషన్ను రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరనున్నట్లు సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement