
కోదండరాంకు అభినందన
బంజారాహిల్స్, : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను వాకర్స్ ఇంటర్నేషనల్ విశ్రాంత డిస్ట్రిక్ట్ గవర్నర్ ఏబీ కుప్పురాం ఆధ్వర్యంలో వందలాది మంది వాకర్లు మంగళవారం ఆయన నివాసంలో కలిసి ఘనంగా సత్కరించారు.
మిఠాయిలు తినిపించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా కోదండరాం వారితో మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో ఎలా పాల్పంచుకున్నారో బంగారు తెలంగాణ ఏర్పాటులో కూడా అలాగే ముందుకు రావాలని సూచించారు.