హైదరాబాద్ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపట్ల తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షనేత జానారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతి తమిళనాడు రాష్ట్రంతో పాటు దేశానికీ తీరని లోటని అన్నారు. 74 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన జయలలిత సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో తుది శ్వాస విడిచిన సంగతి తెల్సిందే.