సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై తాజా మాజీ మిత్రపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు మొక్కుబడిగా ప్రజా ఫ్రంట్ కూటమికి నేతృత్వం వహించిన కాంగ్రెస్, ఆ తర్వాత మిత్రపక్షాలను పట్టించుకోకపోవడంపై ఈ పార్టీల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భావసారూప్య పార్టీలను కలుపుకు పోయేందుకు ఆసక్తి కనబరచకపోవడాన్ని తప్పుబడుతున్నాయి. శాసనసభ ఫలితాలు వెలువడిన మూడు నెలల్లోనే పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరా యించినా కాంగ్రెస్ నాయకత్వం ఆలోచనా ధోరణిలో మార్పులేకపోవడం పట్ల ఈ పార్టీల్లో అసహనం వ్యక్తమవుతోంది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి తమ పార్టీనే ప్రత్యామ్నాయమంటూ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీరాలు పోతున్నా రాష్ట్ర స్థాయిల్లో ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రంలో రాజకీయంగా దిగజారిపోతున్నా కనువిప్పు కలగడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
లోక్‌సభలో 4 సీట్లిస్తే సరిపోయేది..
లోక్‌సభ ఎన్నికల్లోనూ సీపీఐ, టీజేఎస్, టీడీపీలకు కాంగ్రెస్ ఒక్కో సీటు కేటాయించి, మరో స్థానంలో పోటీకి పెట్టకపోవడం ద్వారా సీపీ ఎంకు మద్దతునిస్తే మంచి ఫలితాలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుందని అంతర్గత చర్చల్లో ఈ పక్షాల నేతలు చెబుతున్నారు. ఈ విధంగా మిగతా 13 సీట్లలో మిత్రపక్షాల ఓట్లు కనీసం లక్షకు పైగా కలిసొచ్చే అవకాశాలు ఉంటాయంటున్నారు. సొంత పార్టీలోనే అసంతృప్తి పెరుగుతున్నా, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు కూడా ఫిరాయింపులకు దిగుతున్నా వాస్తవ పరిస్థితులను అంచనా వేయడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందడాన్ని ఈ పార్టీల నాయకులు తప్పుబడుతున్నారు.
కాంగ్రెస్‌పై మిత్రుల గుస్సా
Published Thu, Mar 14 2019 2:59 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment