'స్టార్‌ క్యాంపెయినర్లను ఎంపిక చేయండి' | Congress use star campaigners to woo voters | Sakshi
Sakshi News home page

'స్టార్‌ క్యాంపెయినర్లను ఎంపిక చేయండి'

Published Fri, Mar 14 2014 2:32 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

'స్టార్‌ క్యాంపెయినర్లను ఎంపిక చేయండి' - Sakshi

'స్టార్‌ క్యాంపెయినర్లను ఎంపిక చేయండి'

హైదరాబాద్ : ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు అధికారం ఏఐసీసీదేనని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో పొత్తు అంశాన్ని పరిశీలించేందుకు హైకమాండ్ ఆంటోనీ కమిటీని వేసిందని ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. మరోవైపు టికెట్ల కోసం గాంధీభవన్లో నేతలు పాట్లు పడుతున్నారు. దిగ్విజయ్ సింగ్ నేతలు విడివిడిగా కలిసి ఎన్నికల్లో తమకు టికెట్ కేటాయించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.

ఇక చక్కటి వాగ్థాటి కలిగిన ముప్పై మంది స్టార్‌ ప్రచారకర్తల్ని ఎంపిక చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఈ సందర్భంగా దిగ్విజయ్‌ సింగ్‌  ఆదేశించారు.  స్టార్‌ క్యాంపెయినర్ల ఖర్చు పార్టీ పద్దులోకి వెళ్తుందని కాబట్టి అద్భుత వ్యక్తుల్ని ఎంపిక చేయాలని  సూచించారు. తెలంగాణలో ఓట్లు సాధించేందుకు  జాతీయస్థాయి  నాయకులు ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందనే దానిపై జాబితా రూపొందించమని కూడా సూచించారు. దళితులు, మైనార్టీలు, రైతులు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో.. ఎవరితో ప్రచారం చేయిస్తే బాగుంటుందో పరిశీలించాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement