సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాససనభ ఎన్నికల్లో పోటీచేయబోయే కాంగ్రెస్ అభ్యర్థులను ఈ నెల 22-28 తేదీల్లో ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. అందులో భాగంగా తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీలతో సమావేశమై వారి అభిప్రాయాలను ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ముందు ఉంచుతామని పేర్కొన్నారు. మూడు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం గురువారం హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్‌సింగ్ నేరుగా బంజారాహిల్స్‌లోని ఓ స్టార్ హోటల్‌కు వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన దిగ్విజయ్‌సింగ్‌ను కలిసేందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ముఖం చాటేశారు.
గురువారం ఉదయం 11 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న దిగ్విజయ్‌కు స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మినహా ఆ ప్రాంత నాయకులెవరూ రాలేదు. ఆయన బసచేసిన హోటల్ వద్దకు సైతం మాజీమంత్రి సి.రామచంద్రయ్య మినహా సీమాంధ్ర నేతలెవరూ రాలేదు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు విమానాశ్రయానికి తరలివచ్చి దిగ్విజయ్‌కు స్వాగతం పలికారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బలరాంనాయక్, వీహెచ్, పొన్నం, అంజన్, రాజగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, దానం నాగేందర్, షబ్బీర్‌అలీ, పలువురు సీనియర్ నేతలు అక్కడికి వచ్చారు.
అందరినీ కలుపుకుని ముందుకువెళ్తాం: పొన్నాల
అంతకువుుందు వివూనాశ్రయుం వద్ద పొన్నాల లక్ష్మయ్య మీడియాతో వూట్లాడుతూ.. అందరిని కలుపుకుని వుుందు కు వెళ్తూ పార్టీని వురింత పటిష్టంగా చేస్తామని చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వూట్లాడుతూ దిగ్విజయ్ సలహాలు, సూచనలు తీసుకుని కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మరింత బలోపేతం చేయటానికి చర్యలు తీసుకుంటామన్నారు.
22-28 తేదీల్లో అసెంబ్లీ అభ్యర్థుల జాబితా: దిగ్విజయ్
Published Fri, Mar 14 2014 2:23 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement