'జైపాల్ కు అవగాహన లేదు'
Published Sun, Nov 6 2016 6:31 PM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM
హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గల్లీ నుంచి ఢిల్లీకి వస్తే.. కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మాత్రం ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చాడని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం విమర్శించారు. జైపాల్ రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి అయి ఉండి కూడా.. హైదరాబాద్ లిబరేషన్ గురించి అవగాహన లేకుండా మాట్లాడారని తప్పుబట్టారు.
వల్లభాయ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్లే హైదరాబాద్‌కు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. నెహ్రూ, వల్లభాయ్ పటేల్ లు తీసుకున్న నిర్ణయం వల్లే హైదరాబాద్ పై పోలీసు చర్య తీసుకున్నారని చెప్పడం తప్పని అన్నారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో ఎన్ కేకే నాయర్ రాసిన పుస్తకం చదివితే ఆ విషయం జైపాల్ కు అర్ధమవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. కశ్మీర్ సమస్యకు మూల కారణం కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు.
Advertisement
Advertisement