తండ్రి వేధింపులు తాళలేక ఓ బాలిక పోలీసులను ఆశ్రయించింది.
తండ్రి వేధింపులు తాళలేక ఓ బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఫిల్మ్‌నగర్ జ్ఞానిజైల్‌సింగ్‌నగర్‌కు చెందిన శంకర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యానికి బానిసైన ఇతడు తరచూ పెద్ద కుమార్తె(16)ను వేధిస్తున్నాడు. తాగిన మత్తులో ఆమెను దుర్భాషలాడుతూ కొడుతున్నాడు. అడ్డు వచ్చిన భార్య, చిన్నకుమార్తెకు వేధింపులు తప్పటంలేదు. తండ్రి దాష్టీకం తాళలేని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.