అణు భద్రతకు ‘ఈసీఐఎల్’ అస్త్రం | design of the device RDE | Sakshi
Sakshi News home page

అణు భద్రతకు ‘ఈసీఐఎల్’ అస్త్రం

Published Tue, Jul 7 2015 2:53 AM | Last Updated on Sun, Sep 3 2017 5:01 AM

అణు భద్రతకు ‘ఈసీఐఎల్’ అస్త్రం

అణు భద్రతకు ‘ఈసీఐఎల్’ అస్త్రం

ఆర్‌డీఈ పరికరం రూపకల్పన
హైదరాబాద్: అణు ఇంధన పదార్థాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే అత్యాధునిక పరికరాన్ని రూపొందించి  కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) అరుదైన ఘనత సాధించింది. రెడియోలాజికల్ డిటెక్షన్ ఇక్వూప్‌మెంట్ (ఆర్‌డీఈ) గా పిలిచే ఈ పరికరాన్ని ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ (జేఎన్‌టీటీ) కి అందజేసినట్లు సంస్థ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.

సోమవారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఈసీఐఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ సుధాకర్.. జేఎన్‌పీటీ చైర్మన్ నీరజ్ బన్సాల్‌కు ఈ పరికరాన్ని అందజేసినట్లు వెల్లడించాయి. వివిధ వాహనాల్లో అక్రమంగా తరలించే అణుఇంధన పదార్థాలను ఈ పరికరం ఇట్టే గుర్తిస్తుందని తెలిపాయి. పోర్టుల వద్ద ఏర్పాటు చేసిన ఆర్‌డీఈ పరికరం వాహనాలను పూర్తిగా స్కాన్ చేసి నిషేధిత పదార్థాలు ఉంటే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తుందని పేర్కొన్నాయి. అంతేకాకుండా ఈ పరికరంలో అమర్చిన కెమెరా.. వాహనాల ఫొటోలు, నంబర్ ప్లేట్ వివరాలను, వ్యక్తిని చిత్రీకరించి నేవీ అధికారులకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారాన్ని చేరవేస్తుందని తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement