'స్పీకర్ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది' | disqualification of defected mlas:we are surprised, says ysrcp | Sakshi
Sakshi News home page

'స్పీకర్ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది'

Published Sat, Jul 2 2016 6:40 PM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

'స్పీకర్ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది' - Sakshi

'స్పీకర్ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది'

హైదరాబాద్ :అనర్హత పిటిషన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిర్ణయంపై  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. సాంకేతిక కారణాలతో 13 అనర్హత పిటిషన్లను చెల్లవని చెప్పడం రాజ్యాంగ స్పూర్తిని తుంగలో తొక్కడమేనని ఆ పార్టీ అభిప్రాయపడింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్పై నెగ్గి టీడీపీలో చేరింది వాస్తవం కాదా అని ప్రశ్నించింది. నిబంధనల ప్రకారం  అనర్హత పిటిషన్లపై మొదట్లోనే స్పీకర్ వేటు వేయాల్సి ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.

ఈ నెల 8న సుప్రీంకోర్టులో ఫిరాయింపులు కేసు విచారణకొస్తుందన్న నేపథ్యంలోనే...స్పీకర్ హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. స్పీకర్ అనే వ్యక్తి ఖ్వాజీ జుడిషియల్ ట్రిబ్యునల్ మాత్రమేనని, ట్రిబ్యునల్ నియమ నిబంధనలను స్పీకర్ పాటించాలని వైఎస్ఆర్ సీపీ అభిప్రాయపడింది. నిర్ణయం తీసుకునే ముందు పిటిషనర్లకు అవకాశం ఇవ్వాలని, కానీ దానికి విరుద్ధంగా స్పీకర్ వ్యవహరించారని ఆ పార్టీ పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement