- 100 ర్యాంకు లోపు హాజరైన వారు ఆరుగురే
- నేడు 6,001 నుంచి 16 వేల ర్యాంకు వరకు వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం బుధవారం ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి నుంచి 6 వేల ర్యాంకు వరకు విద్యార్థులను వెరిఫికేషన్‌కు పిలవగా 3,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో టాప్ 100 ర్యాంకులోపు వచ్చిన విద్యార్థుల్లో ఆరుగురు మాత్రమే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైనట్లు ప్రవేశాల కన్వీనర్ డాక్టర్ ఎంవీ రెడ్డి వెల్లడించారు. ఇక 500 ర్యాంకులోపు వారు 69 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఇక ఈ నెల 23న 6,001వ ర్యాంకు నుంచి 16 వేల ర్యాంకు వరకు ఉన్న విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తామని తెలిపారు.
అలాగే సాంకేతిక విద్యాభవన్‌లో ఈ నెల 23న ఆంగ్లో ఇండియన్ విద్యార్థులు, వికలాంగులకు ఒకటి నుంచి చివరి ర్యాంకు వరకున్న వారికి వెరిఫికేషన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆర్థోపెడిక్ వికలాంగుల కేటగిరీలో ఒకటి నుంచి 60 వేల ర్యాంకు వరకు ఉన్న విద్యార్థులకు వెరిఫికేషన్ ఉంటుందని వెల్లడించారు. ఇక బుధవారం వెరిఫికేషన్‌కు హాజరైన వారిలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు 2,819 మంది, ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు 282 మంది, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు 145 మంది, నాన్‌లోకల్ విద్యార్థులు 29 మంది వెరిఫికేషన్ చేయించుకున్నట్లు వివరించారు.
ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షురూ!
Published Thu, Jun 23 2016 3:18 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement
Advertisement