నగరంతో పాటు శివార్లలోనూ తెల్లవారుజామున సంచరిస్తూ చైన్‌స్నాచింగ్స్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టును
సిటీబ్యూరో: నగరంతో పాటు శివార్లలోనూ తెల్లవారుజామున సంచరిస్తూ చైన్‌స్నాచింగ్స్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టును సైబరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీసులు రట్టు చేశారు. కొందరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన వారిని పట్టుకోవడంతో పాటు సొత్తు రికవరీపై దృష్టి పెట్టారు. గతేడాది డిసెంబర్‌తో పాటు ఈ ఏడాదీ జంట కమిషనరేట్ల పరిధిలో తెల్లవారుజాము సమయంలో అనేక స్నాచింగ్స్ జరిగాయి. ఇంటి ముందు ముగ్గు వేసుకుంటున్న, పనులు చేసుకుంటున్న మహిళల్ని టార్గెట్ చేసుకునే ఈ ముఠా వరుస పెట్టి పంజా విసిరింది.
వీరి బారినపడ్డ వారిలో కొందరు క్షతగాత్రులూ అయ్యారు. కాస్త దూరంలో వాహనాన్ని స్టార్ట్ చేసుకుని ఓ స్నాచర్ వేచి ఉండటం, నడుచుకుంటూ వచ్చే మరో స్నాచర్ ఏదో ఒక రకంగా మహిళలతో మాట కలిపి మెడలోని నగలు స్నాచింగ్ చేసుకుపోవడం వీరి నైజం. ఈ పంథాలో రెచ్చిపోతున్న గ్యాంగ్ ఉత్తరప్రదేశ్‌కు చెందినదిగా సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటి వరకు వీరు హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో 45 స్నాచింగ్స్ చేసినట్లు అంగీకరించారని తెలిసింది.