జూపార్కులో ఉద్యోగుల ధర్నా | employees dharna in nehru zoological park | Sakshi
Sakshi News home page

జూపార్కులో ఉద్యోగుల ధర్నా

Published Fri, Sep 8 2017 3:33 PM | Last Updated on Tue, Sep 12 2017 2:16 AM

employees dharna in nehru zoological park

హైదరాబాద్‌: ఎలాంటి కారణం లేకుండా ఇద్దరు జూపార్కు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారంటూ ఉద్యోగులు ధర్నాకు దిగారు. బహదూర్ పురాలో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కు సిబ్బంది బిక్షపతి, శ్రీనివాస్‌ అనే వారు ఇటీవల సస్పెన్షన్‌కు గురయ్యారు. వారిని అకారణంగా శిక్షించారంటూ జూ ప్రాంగణంలో ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.
 
సస్పెన్షన్‌ను వెంటనే తొలగించి వారిని విధుల్లోకి తీసుకోవాలని జూపార్కు జేఏసీ నాయకుడు దేవేందర్ డిమాండు చేశారు. ఆందోళన కారణంగా మూగ జీవులకు ఉదయం 10 గంటలకు అందాల్సిన ఆహారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement